Jammu And Kashmir Blast: జమ్ము కాశ్మీర్‍లో వరుస పేలుళ్లు.. హోం మంత్రి పర్యటన ఉంటుందా..!
జమ్ముకశ్మీర్‌ను వరుస పేలుళ్లు వణికించాయి. బుధవారం రాత్రి ఉధంపూర్‌లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. రాత్రి 10.30 సమయంలో దొమాయిల్ చౌక్‌లోని ఓ పెట్రోల్ పంప్ సమీపంలో నిలిపిన బస్సులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కండక్టర్ సునీల్‌సింగ్, మరో వ్యక్తి గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను ఉదంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రామ్‌ఘర్‌కు పంపేందుకు కొన్ని దుప్పట్లను బస్సుపై లోడు చేశారని బాధితులు తెలిపారు. ఆ తర్వాతే ఈ పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఉధంపూర్‌లో మరో బస్సులో పేలుడు జరిగింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉధంపూర్ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది. ఈ రెండు పేలుళ్లపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మరో మూడు రోజుల్లో జమ్ము కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పేలుళ్లు జరగడం సంచలనం రేపుతోంది. దీంతో భద్రతా బలగాలు మరింత భద్రత పెంచుతున్నాయి. హోం మంత్రి తన పర్యటనలో భాగంగా త్రికూట్ హల్స్‌లోని మాతా వైష్ణోదేవీని దర్శించుకోనున్నారు. ఆరు నెలల క్రితం కూడా ఉధంపూర్‌లో బాంబు పేలుడు జరిగ్గా.. స్థానిక సల్తియా చౌక్ వద్ద మాగ్నెటిక్ బాంబ్ పేలి ఒకరు మరణించారు.












Click it and Unblock the Notifications