ఇద్దరి మధ్య వాగ్వాదం: 'ఆమె నా భార్య.. కాదు నా భార్య'
ధన్‌బాద్: ఒక మహిళ కోసం ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. ఇద్దరూ కూడా ఆమె తన భార్యంటే, తన భార్యంటూ అంటూ గొడవపడి చివరకు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... పింకీ దేవి అనే మహిళ తన భార్యేనంటూ లాల్తూ బోస్, సునీల్ శావ్ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో లాల్తూ బోస్, పింకీదేవి కలిసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పెద్దల సమక్షంలో మేమిద్దం పెళ్లి చేసుకున్నామని, తన భార్య అయిన పింకీ దేవిని అతడి భార్య అంటూ చెప్తున్నాడంటూ సునీల్‌పై బోస్ ఫిర్యాదు చేశాడు.

అదే విధంగా సునీల్ ఎవరో తనకు తెలియకపోయినా, గ్రామస్ధులందరికీ తనని అతడి భార్యగా చెప్తున్నాడని పింకీ కూడా పోలీసులకు వివరించింది. దీంతో సునీల్‌ను పోలీసులు ప్రశ్నించగా తాను బెబుతున్నది కూడా సత్యమని సునీల్ వాదించాడు.
పింకీ తన భార్యేనని, తన చూపు దెబ్బతినడంతో తనను ఇలా వదిలేసి, ఇంట్లోని రేషన్ కార్డుతో సహా ఉన్న ఆధారాలన్నీ తీసుకుపోయిందని చెప్పాడు. మా ఇద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత తనను, తన కుమారుడిని వదిలేసి ఆ తర్వాత ఇద్దరిని పెళ్లాడిందని పేర్కొన్నాడు.
వారిద్దరిని వదిలేసి, ప్రస్తుతం తన భార్య లాల్తూ బోస్‌తో ఉంటోందని పోలీసులకు చెప్పాడు. ఇద్దరి వాదనలను విన్న పోలీసులు తల పట్టుకున్నారు. ఆ తర్వాత 'మీ వాదనలను నిరూపించే చట్టపరమైన ఆధారాలతో రండి' పోలీసులు స్టేషన్ నుంచి పంపించి వేశారు.












Click it and Unblock the Notifications