గొడవపడి... ఒకరినొకరు కాల్చుకున్న పోలీసులు, మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు ఒకర్నొకరు తుపాకితో కాల్చి చంపుకున్నారు. పాట్నాలోని బిక్రం బ్లాక్ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న పోలీసులిద్దరు పరస్పరం ఘర్షణ పడి, ఆవేశంలో తమ సర్వీస్ రైఫిళ్లతో కాల్చి చంపుకున్నారని పాట్నా పోలీస్ సూపరిటెండెంట్ జితేంద్ర రాణా వెల్లడించారు.
ఏ విషయంలో గొడవ పడ్డారనేది ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టామని, అసలు విషయాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

అత్యాచార నిందితుడికి 21ఏళ్ల జైలు
చెన్నై: 14ఏళ్ల బాలికను మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో ఈరోడ్ జిల్లా మహిళా కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. నిందితుడికి 21ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. తమిళనాడులోని ఈరోడ్ ఒడైపల్లం ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్(29)కి ఇద్దరు భార్యలున్నారు.
విచక్షణ మరచిన నిందితుడు 2013, ఆగస్టు 11న అదే ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు గోపాల్‌పై మోపిన అభియోగాలు రుజువైనందున అతడికి మొత్తం 21ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.












Click it and Unblock the Notifications