పట్టపగలు తుపాకులకు పని, ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్య, కారులో?
కర్ణాటకలోని హాసన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కాల్చి చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మొదట పోలీసులు అనుకున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరిని మరి కొందరు పట్టపగలు కాల్చి చంపేసి తప్పించుకుని వెళ్లిపోయారని అనుమానం రావడంతో హాసన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నాకాబంది కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన హాసన్ నగరంలోని హోయసళ నగర్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం మద్యాహ్నం జరిగింది. ఓవ్యక్తి వచ్చి కారును ఖాళీ ప్రదేశంలో ఆపాడు. కారులో ఉన్న వాళ్లు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడాడు. అంతలో అకస్మాత్తుగా కారు దగ్గర తుపాకీ నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. ఈ శబ్ధం విని స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు షాక్ అయ్యారు. తుపాకి కాల్పుల శబ్దం విన్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.

హాసన్ లోని కే.ఆర్. పురం స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యలు జరిగిన ప్రాంతంలో పోలీసులు కొన్ని సాక్షాలు సేకరించారు. బెంగళూరుకు చెందిన ఆసిఫ్, హాసన్‌కు చెందిన షౌకత్ అలీలు హత్యకు గురైనారని పోలీసులు అంటున్నారు. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హాసన్‌లో సైట్ చూసేందుకు వచ్చి కారులో కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య గొడవ మొదలైంది. ఆ సందర్బంలో తుపాకీ పట్టుకున్న వ్యక్తి ఆసిఫ్, షౌకత్ ఆలీలపై కాల్పులు జరిపారు. హత్య చేసిన వ్యక్తులను స్థానికులు ఎవ్వరూ చూడలేదని పోలీసులు అంటున్నారు. వ్యాపార లావాదేవీల కారణంగా జంట హత్యలు జరిగి ఉంటాయని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఒక శవం కారులో ఉందని, మరొక శవం కారు ముందు భాగంలో నేల మీద పడి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. హాసన్ నగరంలో పట్టపగలు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హత్యకు గురికావడం కలకలం రేపింది.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications