అక్కాచెల్లెళ్లను ఇద్దరు వ్యక్తులు కొట్టి రేప్ చేశారు

ఈ సంఘటన ఆగస్టు 16వ తేదీన జరిగినట్లు సమాచారం. అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18, 20 ఏళ్ల వయస్సు గల యువతులను ఇద్దరు వ్యక్తులు అడ్డగించి, వారిపై దాడి చేసి అత్యాచారం చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో వారు ఉన్నతాధికారిని సంప్రదించడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
తమకు గాయాలయ్యాయని, తమ శరీరాలపై కొరికిన గుర్తులు కూడా ఉన్నాయని అమ్మాయిలు చెప్పారు. అమ్మాయిలు ఇద్దరు కూడా బర్మేర్‌లోనే ఉంటున్నారు. తమకు పోలీసులు పూర్తి రక్షణ కల్పించే వరకు ఊరికి వెళ్లేది లేదని భీష్మించుకున్నారు.












Click it and Unblock the Notifications