Illegal affair: పక్క వీధిలో ప్రియురాలు, కరెంట్ షాక్ తో కూతుర్లు హత్య, భార్య బతికిపోయింది !
కోల్ కత్తా: భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి సంతోషంగా జీవిస్తున్న భర్త వ్యాపారం పనుల మీద బయట తిరుగుతున్నాడు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి మోజులోపడిన భర్త ఇంట్లో భార్య, ఇద్దరు కుమార్తెలకు చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు. నేను నీకు ప్రతిరోజూ పడకసుఖం ఇస్తున్నాను, నువ్వు ఎందుకు పక్కవీదిలోని పారాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని భార్య ఆమె భర్తతో గొడవపడుతూ వచ్చింది.
భార్య, కుమార్తెలు తన అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నారని కోపంతో కన్న తండ్రి విద్యుత్ తీగలు కత్తిరించి ఇంటి ముందుపడేశాడు. ఇంటి ముందు ఆడుకోవడానికి వెళ్లిన అక్కాచెల్లి విద్యుత్ షాక్ తో మరణించడం కలకలం రేపింది. భర్త స్కెచ్ తప్పించుకున్న భార్య బతికిపోయింది. కన్నతండ్రి విద్యుత్ తీగలు కట్ చేసి ఇద్దరు కూతుర్లను చంపేశారని తెలుసుకున్న గ్రామస్తులు అతన్ని పట్టుకుని చితకబాదేయడం కలకలం రేపింది.

భార్య, ఇద్దరు కూతుర్లు
పశ్చిమ బెంగాల్ లోని బుర్బా బర్దమన్ జిల్లాలోని కలర్ పూల్ ప్రాంతంలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజేష్, రమాబాయి (పేరు మార్చడం జరిగింది) అనే భార్య ఉంది. రాజేష్, రమాబాయి దంపతులకు 8 సంవత్సరాలు, 6 సంవత్సరాల కుమార్తెలు ఇద్దరు ఉన్నారు.

భర్తకు అక్రమ సంబంధం ?
రాజేష్ కు అదే గ్రామంలో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉందని అతని భార్య రమాబాయికి తెలిసింది. వేరే మహిళతో రాజేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి మోజులోపడిన భర్త రాజేష్ ఇంట్లో అతని భార్య రమాబాయి, ఇద్దరు కుమార్తెలకు చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

ఎదురుతిరిగిన భార్య
నీకు నేను పడకసుఖం ఇస్తున్నాను కదా, నువ్వు ఎందుకు పారాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని భార్య రమాబాయి ఆమె భర్త రాజేష్ తో గొడవపడుతూ వచ్చింది. గ్రామంలో నివాసం ఉంటున్న పెద్దలు, బంధువులు చాలాసార్లు రాజేష్, రమాబాయిల మద్య పంచాయితీలు చేసి విసిగిపోయారు.

విద్యుత్ షాక్ తో కూతుర్లు ప్రాణం పోయింది...... భార్య బతికిపోయింది
భార్య రమాబాయి, కుమార్తెలు తన అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నారని కోపంతో కన్న తండ్రి రాజేష్ ఇంటి ముందు విద్యుత్ తీగలు కత్తిరించి ఇంటి ముందుపడేశాడు. ఇంటి ముందు ఆడుకోవడానికి వెళ్లిన రాజేష్ ఇద్దరు కూతుర్లు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మరణించడం కలకలం రేపింది.

నా మొగుడే నా బిడ్డలను చంపేశాడు
నా భర్త రాజేష్ విద్యుత్ తీగలు కట్ చేసి ఇద్దరు కూతుర్లను చంపేశారని అతని భార్య రమాబాయి గ్రామస్తులకు చెప్పింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాజేష్ ను పట్టుకుని చితకబాదేసి ఊర్లో చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్ ను అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగా కన్న తండ్రి ఇద్దరు కుమార్తెలను హత్య చెయ్యడం పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications