దారుణం: తల్లి ముందే కూతుళ్లను కట్టేసి గొంతుకోశారు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు.. కన్న తల్లి ముందే ఆమె ఇద్దరు కుమార్తెల గొంతుకోసం దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాజహాన్‌పూర్‌ జిల్లాలోని రతౌలి గ్రామానికి చెందిన ఉషాదేవి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది.

పెద్ద కుమార్తె రేఖ(25)కు పెళ్లయినా కొంతకాలంగా తల్లి వద్దే ఉంటోంది. సోమవారం రాత్రి కొందరు ఆగంతకులు ఉషాదేవి ఇంట్లో చొరబడి కుమార్తెలు రేఖ, సవిత(19)తో సహా ఆమెను బంధించారు. అనంతరం తల్లి ముందే ఇద్దరు కుమార్తెల గొంతుకోసి దుండగులు పరారయ్యారు.

Two sisters hacked to death near Lucknow

తీవ్రంగా గాయపడిన అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబంతో సంబంధం ఉన్నవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆపరేషన్లు వికటించి పాక్షికంగా చూపుకోల్పోయిన 16 మంది

ఓ చారిటబుల్‌ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించడంతో 16 మంది పాక్షికంగా చూపు కోల్పోయారు. ఈ ఘటన నవంబరు 24వ తేదీన హర్యాలోని మహేశ్‌నగర్‌లో చోటుచేసుకుంది. కాగా, ఈ విషయాన్ని మంగళవారం హర్యానా అధికారులు వెల్లడించారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆ క్యాంపు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+