సీఎం ముందే అత్తా, కోడలు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం, పోలీసుల టార్చర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒకే కుటుంబంలో నలుగురు నిప్పంటిచుకోవడంతో ముగ్గురు మరణించిన ఘటన 24 గంటలు పూర్తి కాకముందే అత్తా, కోడలు కలిసి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు.

తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలోని శివకాశిలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పాల్గొన్న ఎంజీఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమం ముందే మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పార్వతి, ఆమె కోడలు కనగలక్ష్మి అనే ఇద్దరు మహిళలు మంగళవారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Two Woman attempt self immolation infront of Tamil Nadu CM

పార్వతి కుమారుడు మునిస్వామిని కనగలక్ష్మి వివాహం చేసుకుంది. ఓ మహిళ చైన్ స్నాచింగ్ కేసులో మునిస్వామి మీద కేసు నమోదు కావడంతో అతను పరారైనాడు. ఇదే కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి మునిస్వామి కోసం గాలిస్తున్నారు.

మునిస్వామి మీద హత్యాయత్నం కేసుతో పాటు అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మునిస్వామి ఆచూకి తెలుసుకోవడానికి పోలీసులు పార్వతి, కనగలక్ష్మిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. పోలీసులు మునిస్వామి మీద లేనిపోని కేసులు నమోదు చేశారని పార్వతి, కనగలక్ష్మి ఆరోపిస్తున్నారు.

మునిస్వామి మీద నమోదు చేసిన కేసును ఉప సంహరించుకోవాలని, పోలీసులు మమ్మల్ని వేధించుకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పాల్గొంటున్న కార్యక్రమం ముందు వీరిద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. అత్త పార్వతి, కోడలు కనగలక్ష్మిలను పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two women attempted self- immolation at a government function attended by Tamil Nadu Chief Minister Palaniswami at Sivakasi, which police dubbed a drama, alleging that they did it to help a kin evade arrest in a pending criminal case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి