మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !
బెంగళూరు: మహిళను వశీకరణ (చేతబడి) చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు తాలుకా ఉచ్చంగిపుర గ్రామంలో జరిగింది. గ్రామస్తుల చేతిలో తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు చికిత్స చేయించి విచారణ చేస్తున్నారు. మహిళను వశీకరణ చెయ్యడానికి రూ. 70 వేలకు ఒప్పందం చేసుకున్నారని విచారణలో వెలుగు చూసింది.
ఉచ్చంగిపుర గ్రామంలో దేవక్క అనే మహిళ నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఉచ్చంగిపుర గ్రామంలోకి వెళ్లారు. తరువాత దేవక్క ఇంటికి వెళ్లి ఆమెను వశీకరణ చెయ్యడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు దేవక్క ఇంటి దగ్గరకు వెళ్లారు.

వశీకరణ చెయ్యడానికి వెళ్లిన ఇద్దరిని పట్టుకుని గట్టిగా ప్రశ్నించారు. అప్పటికే వారి దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వెంట్రుకలు, ఇనుప కడ్డీలతో పాటు చేతబడి చెయ్యడానికి ఉపయోగించే వస్తువులు ఉండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరినీ ఇష్టం వచ్చినట్లు చితకబాదారు.
Recommended Video
అదే గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తి రూ. 70 వేలు ఇస్తానని, దేవక్కను వశీకరన చెయ్యాలని తమకు చెప్పాడని, అడ్వాన్స్ గా రూ. 20 వేలు ఇచ్చారని ఇద్దరు వ్యక్తులు గ్రామస్తులకు చెప్పారు. అయితే రూ. 70 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్న వ్యక్తి వివరాలు మాత్రం ఆ ఇద్దరు చెప్పకపోవడంతో మళ్లీ వారికి దేహశుద్ది చేశారు.
ఇద్దరు వ్యక్తులు దావణగెరె జిల్లా గడియార బండ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని గ్రామస్తుల విచారణలో వెలుగు చూసింది. దేవక్క అనే మహిళను వశీకరణ చెయ్యడానికి వెళ్లిన ఇద్దరి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications