ఇండియన్ స్టూడెంట్స్‌కు అమెరికా ఆఫర్: డిగ్రీతో పాటే గ్రీన్ కార్డ్, నిజమయ్యేనా?

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ట్రావెల్ బ్యాన్, వీసా ఆంక్షలతో విదేశీయులకు తలుపులు మూసివేస్తున్న అమెరికా.. అదే సమయంలో ప్రతిభావంతులైన యువతులకు మాత్రం స్వాగతం పలకాలని చూస్తోంది. దేశాభివృద్దికి దోహద పడే ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా నార్త్ కరోలినాకు సెనేటర్ థాం టిల్లిస్ ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో అమెరికా తన అగ్రస్థానాన్ని నిలుపుకోవాలంటే భారతీయ ప్రతిభ అవసరమని ఆయన చెప్పారు. ఇందుకోసం అమెరికా వచ్చే భారతీయ విద్యార్థులకు టెక్ డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

ఇండియన్ అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సెనేటర్ పాల్గొన్నారు. భారతీయ ప్రతిభను తిరిగి సంపాదించుకునే క్రమంలో ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్, విద్యార్థులకు డిగ్రీలతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వాలని అన్నారు.

U.S. lawmakers back green cards for STEM graduates

అమెరికా ఆర్థికాభివృద్ధిని మూడు నుంచి నాలుగు శాతానికి పెరిగేలా చేయడానికి హైటెక్ జాబ్స్, అడ్వాన్స్ డ్ డిగ్రీలు, అడ్వాన్స్ డ్ అనాలిటిక్స్, సైన్సు అండ్ రీసెర్చీల్లో మానవ వనరులు అవసరమన్నారు. తద్వారా అమెరికా తన అగ్రస్థానాన్ని నిలుపుకోవడంతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా తన ఉనికిని చాటుకుంటుందని తెలిపారు.

సెనేట్ జ్యుడిషియరీ కమిటీకి సభ్యుడైన టిల్లిస్, ఇమిగ్రేషన్ పాలసీలో వీసాల సవరణ కీలకమని చెప్పారు.
హెచ్1బి ప్రీమియం వీసాలను వచ్చే ప్రిల్ 3నుంచి నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపయంలో నార్త్ కరోలినా సెనేటర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
U.S. Senator Thomas Tillis said on Wednesday all international students who complete an advanced degree in Science, Technology, Engineering and Math (STEM) in the country should be given permanent residency in America.
Please Wait while comments are loading...