అమిత్‌షా: మహా వికాస్ అఘాడీని చీల్చే ఎత్తు?
కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడిన మహా వికాస్ అఘాడీని చీల్చే కుట్రను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమలు చేయాలనుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. ఇటీవల అమిత్ షా నాగపూర్ లో పర్యటించిన సమయంలో తమ పార్టీకి చెంది నేతలతో సమావేశం నిర్వహించగా, ఇందులో కొంతమంది నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. మహా వికాస్ అఘాడీని చీల్చడం లేదంటే విచ్ఛిన్నం చేయడం, శరద్ పవర్ ను, ఉద్దశ్ ఠాక్రే సంబంధాలను బలహీనపరచడంలాంటివి చేయాలని సదరు నేతలకు అమిత్ షా నిర్దేశించినట్లు ఉద్ధవ్ తెలిపారు.
నేరుగా ప్రజలకే చెప్పాలి
శరద్ పవర్ ను లక్ష్యంగా చేసుకొని కూటమిని బలహీనపరిచే ప్రణాళికను అమలు చేస్తున్నారన్నారు. తమ కూటమి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలదని, అధికారంలో ఉన్న బీజేపీ కాదన్నారు. తనను, శరద్ పవార్ ను నిలవరించేందుకు తలుపులు మూసుకొని మాట్లాడుకోవడం ఎందుకని, నేరుగా ప్రజల ముందుకే చెప్పాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే రామ్ టెక్ నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కూటమిని రాజకీయంగా ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారని, బీజేపీ మహారాష్ట్రను దోచుకుంటోందని మండిపడ్డారు.

30 ఏళ్ల పొత్తును తెంచుకుంది
2014 ఎన్నికలకు ముందు మూడు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న పొత్తును బీజేపీ తెంచుకుందన్నారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో శివసేన 63 సీట్లు గెలుచుకొని తన బలాన్ని చాటుకుందన్నారు. ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడం, నేతలను వేటాడంలాంటివాటితో బీజేపీ హిందూత్వం నిండివుందా? దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏకీభవిస్తున్నారా? అని ఉద్దశ్ ప్రశ్నించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాన్ని దోచుకోకుండా నిలవరించేందుకేనని, అధికారం గురించి కాదని స్పష్టం చేశారు. మహా వికాస్ అఘాడీకి ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.












Click it and Unblock the Notifications