మహా సంక్షోభం: రంగంలోకి రష్మి థాకరే.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో భేటీ.. తిరిగి రావాలంటూ..
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా వినడం లేదు. వారిని వెనక్కి రప్పించేందుకు ఉద్దవ్ థాకరే చేయని ప్రయత్నం లేదు. ఇక చేసేదేమీ లేక.. రాజీనామా కూడా చేస్తానని చెప్పారు. అయినా రెబల్ ఎమ్మెల్యేల్లో ఉలుకు లేదు పలుకు లేదు. ఉద్దవ్ కుమారుడు ఆదిత్య థాకరే కూడా.. వారికి వార్నింగ్ ఇచ్చాడు. అయినా నో యూజ్.. సో ఉద్దవ్ భార్య రష్మి థాకరే రంగంలోకి దిగారు. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో మాట్లాడుతున్నారు. భర్తలను ఒప్పించి.. తిరిగి రావాలని కోరుతున్నారు. మరీ ఈ ప్రయత్నం అయినా సఫలం అవుతుందా లేదో చూడాలీ..

రంగంలోకి రష్మి..
సీఎం ఉద్ధవ్ థాకరే భార్య సతీమణి రష్మీ రంగంలోకి దిగారు. తిరుగుబాటు ఎగురవేసి.. అసమ్మతి కూటమిలో చేరిన ఎమ్మెల్యేల భార్యలను కలుస్తున్నారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తున్న రష్మీ థాకరే.. వారి భర్తలను ఒప్పించాలని కోరుతున్నారు. శనివారం శివసేన జాతీయ కార్యవర్గ సమాశం జరిగింది. ఇందులో రెబల్స్‌పై చర్యలు తీసుకొనేందుకు ఉద్ధవ్‌కు అధికారం అప్పజెప్పుతూ తీర్మానం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోకూడదని, వేచి చూడాలని నిర్ణయించింది. ఏ రాజకీయ వర్గం కూడా శివసేన పేరు, బాల్ థాకరే పేరును ఉపయోగించుకోవద్దని మరో తీర్మానం చేసింది.

తండ్రి పేరుతో అడగండి..
ఓట్లు అడిగేవారు.. తండ్రి పేరుతో ఓట్లడగండి.. కానీ బాల్ థాకరే పేరు వాడొద్దని ఉద్ధవ్ థాకరే రెబల్స్‌కు స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనివారం సమన్లు పంపించారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన ఫిర్యాదులపై సోమవారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు.