సుప్రీంకోర్టుపైనే ఆశలు- సీజేఐ డీవై చంద్రచూడ్‌పై అందరి దృష్టీ..!!
శివసేన పేరు, విల్లు-బాణం ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్- ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించడాన్ని ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. శివసేన పేరు, విల్లు-బాణం ఎన్నికల గుర్తును మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోల్పోయారు. ఈ రెండింటినీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి దక్కింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే వర్గమే.. అసలైన శివసేన పార్టీగా గుర్తించినట్లు వెల్లడించింది.

నిబంధనల ఉల్లంఘన..
ప్రస్తుతం శివసేన రూపొందించుకున్న నిబంధనలు, ఆ పార్టీ అమలు చేస్తోన్న అంతర్గత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఎన్నికల కమిషన్ అధికారులు వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గతంగా ఎలాంటి ఎన్నికలను కూడా శివసేన నిర్వహించలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ అగ్ర నాయకత్వం రూపొందించుకున్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలేవీ పరిగణనలోకి తీసుకోలేమని అన్నారు.

ఘాటుగా స్పందించిన ఉద్ధవ్ వర్గం..
దీనిపట్ల ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఉత్తర్వులు వెలువడతాయని తాము ముందే ఊహించామని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పై తమకు ఎలాంటి నమ్మకం లేదని ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన అధికార ప్రతినిధి ఆనంద్ దుబే అన్నారు.

సుప్రీంకోర్టులో ఉండగా..
ఎన్నికల గుర్తు కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉందని, అలాంటప్పుడు ఈసీ అధికారులు దీనిపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇది సబ్ జ్యుడీషియరీ పరిధిలోకి రాదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇప్పటివరకు గుర్తు కేటాయింపుపై ఎలాంటి తుది నిర్ణయాన్ని తీసుకోలేదని గుర్తు చేశారు.

ఈసీ నిర్ణయంపై..
ముందుగా ప్రకటించినట్టే- ఈసీ నిర్ణయాన్ని ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని అత్యవసర పిటీషన్ గా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్ నాథ్ సిండే వర్గానికి కేటాయించే విషయంలో ప్రాథమిక సూత్రాలను ఈసీ అధికారులు విస్మరించారని పేర్కొన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.

అత్యవసరంగా.. నో
ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అభిషేక్ మను సింఘ్వీ చేసిన వాదనలతో ఏకీభవించలేదు. ఇవ్వాళ షెడ్యూల్ చేసిన పిటీషన్లతో కలిపి మంగళవారం దీన్ని విచారించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నిరాకరించారు. ఈ పిటీషన్ ను రేపు తమ దృష్టికి తీసుకుని రావాలని, లిస్టింగ్ ఎప్పుడు చేయాలనేది ఆ తరువాతే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications