Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈడీ అధికారులపై వసూళ్ల ఆరోపణలు.. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు : ఉద్దవ్ థాకరే సంచలన నిర్ణయం.

మహావికాస్ అఘాడి ప్రభుత్వంపై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శివసేన మండిపడుతోంది. తమ కూటమి నేతలను టార్గెట్ చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. మహావికాస్ అఘాడికి చెందిన పలువురు నేతలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేశాయి. వారి ఆస్తులను చేశాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, శిససేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ అదికారులు షాక్ ఇచ్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన కుటుంబానికి చెందిన దాదాపు రూ. 11 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

ఈడీ అధికారులపై దర్యాప్తునకు సీట్ ఏర్పాటు...

ఈడీ అధికారులపై దర్యాప్తునకు సీట్ ఏర్పాటు...

ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తునకు "సిట్" ఏర్పాటు చేసింది. ఈడీ అధికారులలో కొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ పలుసార్లు ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలో వారిపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు వీరేష్ ప్రభు అనే అధికారి నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ వెల్లడించారు.

జైలుకు వెళ్లక తప్పదు

జైలుకు వెళ్లక తప్పదు


ఈడీ అధికారులలో కొందరు బీజేపీకి ఏటీఎంలుగా పనిచేస్తున్నారని ఎంపీ సంజయ్ రౌత్ గతంలో ఆరోపించారు. నలుగురు ఈడీ అధికారులు బలవంతపు వసూళ్ల పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని .. వాటిపై ముంబై పోలీసులు విచారణ జరుపనున్నారని పేర్కొన్నారు. వారిలో కొందరు జైలుకు కూడా వెళ్లక తప్పదని హెచ్చరించారు. అయితే ఆ అధికారుల పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ అధికారుల వసూళ్ల ఆరోపణలపై ఉద్దవ్ థాకరే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

 సంజయ్ రౌత్ కు ఈడీ షాక్

సంజయ్ రౌత్ కు ఈడీ షాక్


అటు మంగళవారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబానికి చెందిన దాదాపు రూ. 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ రూ. 11 కోట్లలో 9 కోట్లు ఆస్తులు సంజయ్ రౌత్ కుమారుడుకు సంబంధించింది కాగా మిగతా రూ 2 కోట్లు ఆస్తులు రౌత్ భార్యకు చెందింది. అటు మంబాయిలోని దాదర్ సబర్బన్ లో ఓ ఫ్లాట్ ను ఒక ఫ్లాట్, అలీబాగ్ లోని కొన్ని ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దాదాపు రూ.1034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సంజయ్ రౌత్ కు ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల్ని జప్తు చేసింది. ఈ పరిణామాల క్రమంలో అవినీతి ఆరోపణలపై కొందరు ఈడీ అధికారులపై దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+