విజయ్ ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఆ ముగ్గురు రెడ్లు..? - గురి పెట్టిన డీఎంకే..!!

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం విజయ్ టీం లో ముగ్గురు నేతల చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయం నడుస్తోంది. ఈ ముగ్గురు విజయ్ ప్రభుత్వాన్ని తమ గుప్పెట పెట్టుకున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. ఈ ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.. విజయ్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించారు. ఇక.. ఇప్పుడు ఈ ముగ్గురి పైన డీఎంకే గురి పెట్టింది. వారి వ్యవహారాలు బయట పెడతామని హెచ్చరిస్తోంది. దీంతో.. అసలు ఎవరు వారు అనే చర్చ మొదలైంది.

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఆ ముగ్గురు రెడ్ల వ్యవహారం సంచలనంగా మారింది. ఏపీకి చెందిన ఆ ముగ్గురు రెడ్ల పైన అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి నీడలా ఉంటున్న విష్ణురెడ్డి, ఆయన బావమరిది సుజయ్ రెడ్డి, ఈయన స్నేహితుడు అనిల్ రెడ్డి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, గనుల శాఖను గుప్పెట్లోకి తీసుకున్నారని ఉదయనిధి ఆరోపించారు.

అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ పై బాడీ షేమింగ్ సైగ..! క్లారిటీ ఇచ్చిన విజయ్..!
అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ పై బాడీ షేమింగ్ సైగ..! క్లారిటీ ఇచ్చిన విజయ్..!
Udhayanidhi Stalin Alleges Three Reddys Calling the Shots in Tamil Nadu Mining Contracts

దీంతో.. అసలు ఈ ముగ్గురు ఎవరనేది అటు తమిళనాడు.. ఇటు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన విష్ణు రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బంధువు. గ్రానైట్ వ్యాపారం చేయడంతోపాటు దళపతి విజయ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవారని చెబుతున్నారు.విజయ్ తో స్నేహం పెరిగిందని, ఆయన పార్టీ పెట్టిన తర్వాత టీవీకే వ్యవహారాలను సైతం విష్ణురెడ్డి పర్యవేక్షించేవారని చెబుతున్నారు.

కాగా, విష్ణురెడ్డి బావమరిది సుజయ్ రెడ్డి, ఈయన స్నేహితుడు అనిల్ రెడ్డి కూడా ప్రస్తుతం టీవీకే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ ముగ్గురు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ కి ఈ ముగ్గురు రెడ్లు షాడోగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అసైంబ్లీ వేదికగా ఉదయనిధి గత ప్రభుత్వంలో తీవ్ర అవినీతి చేశారని సీఎం విజయ్ ఆరోపించారు.

త్రిష-విజయ్ డేటింగ్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ కామెంట్స్!
త్రిష-విజయ్ డేటింగ్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ కామెంట్స్!

దీనిపై సభలోనే మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదంటూ ఆరోపణలు చేసిన ఉదయనిధి సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ స్నేహితులైన ముగ్గురు రెడ్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఆరోపణలు ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో చర్చగా మారాయి. ఈ ముగ్గురు ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు.. విజయ్ ఈ విమర్శలకు ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+