దేశంలో 20 నకిలీ యూనివర్సిటీలు: యూజీసీ, ఏపీలో ఇవే
న్యూఢిల్లీ: దేశంలో 20 యూనివర్సీటీలను నకిలీవి ప్రకటించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC). ఇలాంటి నకిలీ యూనివర్సిటీలు అత్యధికంగా ఢిల్లీలో ఎనిమిది ఉండగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో రెండేసి, మిగితా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. అంతేగాక, ఈ వర్సిటీలకు డిగ్రీ ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది.
యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు ప్రదానం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ తెలిపింది. అలాంటి యూనివర్సిటీలు ప్రదానం చేసే డిగ్రీలను ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని, ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ తేల్చి చెప్పింది.

ఈ నకిలీ యూనివర్సిటీలకు అసలు డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ(Fake) యూనివర్సిటీల జాబితాను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఢిల్లీలోని ఎనిమిది ఫేక్ యూనివర్సీటీల విషయానికొస్తే.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్-దర్యాగంజ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయం ఉన్నట్లు వెల్లడించింది.
ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు యూనివర్సిటీల జాబితాలో గాంధీ హిందీ విద్యా పీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్ ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని కాకుమానివారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా వర్సిటీలు నకిలీవిగా వెల్లడించింది.
పశ్చిమబెంగాల్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ సంస్థలను నకిలీ వర్సిటీలుగా ప్రకటించింది. కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళలో సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చేరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ నకిలీవని యూజీసీ పేర్కొంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications