ఆగస్టు 31లోపు ఫైనలియర్ పరీక్షలు -అక్టోబర్ 1 నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు -యూనివర్సిటీలకు యూజీసీ గైడ్‌లైన్స్

కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన విద్యా రంగాన్ని తిరిగి గాడిలోకి పెట్టే ప్రయత్నాలను కేంద్రం వేగవంతం చేసింది. కేంద్ర విద్యా శాఖ పరిధిలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి శనివారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించి యూసీజీ తాజా గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. కరోనా ఉధృతి వల్ల గత విద్యా సంవత్సరం కుదుపులకు గురికావడం, పరీక్షలు కూడా సమయానికి జరగకపోవడంతో యూజీసీ ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది.

UGC Guidelines for Academic Year 2021-22, first year classes from October 1, full details

యూజీసీ తాజా ప్రకటన మేరకు ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. "టెర్మినల్ సెమిస్టర్ / ఫైనల్ ఇయర్ పరీక్షలు (2020-2021) తప్పనిసరిగా ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) / ఆన్‌లైన్ / బ్లెండెడ్ (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్) మోడ్‌లో 2021 ఆగస్టు 31 లోపు నిర్వహించాల్సి ఉంటుంది''అని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే,

UGC Guidelines for Academic Year 2021-22, first year classes from October 1, full details

2021- 22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సివుంటుంది. అక్టోబర్ 1 నుంచి అకాడమిక్ సెషన్ ప్రారంభించాల్సివుంటుంది. కాగా, యూజీసీ కోర్సులలో అడ్మిషన్ కోసం 12వ తరగతి బోర్టు పరీక్షా ఫలితాలు వెల్లడికావాల్సివుంటుంది. ఈ ఫలితాలు జూలై 31 నాటికల్లా విడుదల కానున్నాయి. అియతే, ఏదైనా కారణాల వల్ల 12 తరగతి బోర్డు ఫలితం ఆలస్యం అయితే, అక్టోబర్ 18 నుంచి కొత్త సెషన్ ప్రారంభించవచ్చునని యూజీసీ పేర్కొంది. ఇక ఫీజుల విషయానికొస్తే..

UGC Guidelines for Academic Year 2021-22, first year classes from October 1, full details

కరోనా పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 31 వరకు ప్రవేశాలను రద్దు చేసిన విద్యార్థుల నుంచి వర్సిటీలుగానీ, కాలేజీలుగానీ రద్దు ఫీజు వసూలు చేయరాదు. డిసెంబర్ 31 వరకు ప్రవేశాన్ని రద్దు చేసిన విద్యార్థికి ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.1000 వసూలు చేయవచ్చు. సెషన్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నడుస్తుందో లేదో నిర్ణయాధికారం యూజీసీ ఆయా రాష్ట్రాలకు వదిలివేసింది. విద్యాసంస్థల క్యాలెండర్, మార్గదర్శకాలను ఎన్‌ఐసీటీఈ, ఎన్‌సీటీఈ, బీసీఐ, ఎన్‌ఎంసీ, డీసీఐ, ఎన్‌ఐసీ, పీసీఐ, ఆయుష్ వంటి విద్యాసంస్థలతో సంప్రదించిన తర్వాత జారీ చేశామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+