రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకున్న భారతీయులకు క్వారంటైన్ అవసరం లేదు: దిగొచ్చిన బ్రిటన్
లండన్: కొవిషీల్డ్ లేదా యూకే ఆమోదం పొందిన ఇతర కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని తమ దేశానికి వచ్చే భారతీయులను ప్రభుత్వం క్వారంటైన్ చేయదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. అక్టోబర్ 11 నుంచి యూకే వెళ్లే భారతీయులపై ఎలాంటి నిర్భంధం ఉండదని చెబుతూ ట్వీట్ చేశారు.
No quarantine for Indian 🇮🇳 travellers to UK 🇬🇧 fully vaccinated with Covishield or another UK-approved vaccine from 11 October.
— Alex Ellis (@AlexWEllis) October 7, 2021
Thanks to Indian government for close cooperation over last month. pic.twitter.com/cbI8Gqp0Qt
'అక్టోబర్ 11నుంచి యూకే వెళ్లే భారతీయులు కోవిషీల్డ్ లేదా యూకే రెగ్యులేటర్ ద్వారా ఆమోదించిన ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నా.. క్వారంటైన్ ఉండదు. కాబట్టి ఇకనుంచి యూకే వెళ్లడం సులభం. ఈ విషయంపై యూకే ప్రభుత్వానికి సహకరించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు' అంటూ అలెక్స్ ఎల్లిస్ వీడియో ట్వీట్ చేశారు. దీంతో భారత్, బ్రిటన్‌ల మధ్య జరుగుతున్న రాకపోకల గొడవ ముగిసిపోయే అవకాశం ఉంది. మొదట యూకే ఆంక్షలు నేపథ్యంలో భారత్ కూడా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా, విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులకు సంబంధించి వేలాది వీసాలను ప్రాసెస్ చేసినట్లు బ్రిటిష్ హైకమిషనర్ తన సందేశంలో తెలిపారు. గత కొన్ని వారాలుగా ఈ సమస్య వల్ల ఎంతమంది యూకేకి వెళ్లకుండా ఆగిపోయారో తెలుస్తుందన్నారు. రెండు దేశాల మధ్య మరిన్ని విమానాలను ప్రారంభిద్దామని తెలిపారు. గతంలో యూకే ప్రభుత్వం దేశ భద్రతా దృష్ట్యా ప్రయాణ నిబంధనలను సవరించింది. కోవిడ్ -19కి వ్యతిరేకంగా ఆమోదించబడిన టీకాల జాబితాలో మొదట కోవిషీల్డ్ గురించి ప్రస్తావించలేదు.
అయితే, ఆ తర్వాత యూకే ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఎందుకంటే ఇది ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా సూత్రీకరణ. అప్పటికే అది యూకే రెగ్యులేటరీ అథారిటీ ద్వారా గుర్తింపు పొందింది. కానీ కోవిన్ యప్ ద్వారా ఇస్తున్న భారతదేశ టీకా సర్టిఫికెట్‌లను అంగీకరించలేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దేశాలు జారీ టీకా ధ్రువీకరణ పత్రాలకు కనీస ప్రమాణాలుండాలని యూకే ప్రభుత్వం వ్యాఖ్యానించింది. దీంతో సమస్య మొదలైంది.
దీని వల్ల భారతీయులు టీకాలు తీసుకున్నప్పటికీ బ్రిటన్ వెళ్లిన తర్వాత 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంపై భారతీయులపై వివక్ష చూపుతోందంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, యూకే నుంచి భారతదేశానికి వచ్చే వ్యక్తులపై కూడా భారత్ ఇదే విధమైన నిబంధనలను విధించింది. టీకాతో సంబంధం లేకుండా ఎవరైనా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వం దిగొచ్చింది.
ఇది ఇలావుండగా, కరనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. భారత్‌ను సందర్శించాలనుకునే విదేశీయులకు నవంబర్ 15 నుంచి తాజాగా పర్యాటక వీసాలను మంజూరు చేస్తామని వెల్లడించింది.
Recommended Video
అయితే, ఛార్టర్డ్ విమానాల్లో వచ్చే వారికి అక్టోబర్ 15 నుంచే వీసాల మంజూరు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గతేడాది మంజూరు చేసిన వీసాలను నిలిపివేశాం. అంతర్జాతీయ ప్రయాణాలతో కొవిడ్ మరింత విజృంభిస్తుందనే ఉద్దేశంతో ప్రయాణ ఆంక్షలు విధించాం. ప్రస్తుతం కొవిడ్ కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీయులు భారతదేశానికి రావడానికి పర్యాటక వీసాలనే కాకుండా ఇతర భారతీయ వీసాలను మంజూరు చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దీనిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ప్రయాణ ఆంక్షలను సడలించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కరోనా నిబంధనలను విదేశీ పర్యాటకులు తప్పక పాటించేలా మార్గదర్శకాలు ఉండాలని రాష్ట్రాలు కోరాయని సదరు అధికారి తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications