భారత్ కు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ..! తీహార్ జైలును పరిశీలించిన యూకే టీమ్
బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగవేసిన బిలియనీర్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీలు భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం యూకేలో తలదాచుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో కీలక ముందడుగు పడింది. యూకే నుంచి వచ్చిన ఓ టీమ్ తాజాగా దిల్లీలోని తీహార్ జైలును పరిశీలించింది. విజయ్ మాల్యా, నీరమ్ మోదీ లాంటి వ్యక్తులు ఈ జైలులో ఉండగలరా అని పరిశీలన చేసింది. అయితే ఇదే విషయంపై భారత ప్రభుత్వం యూకే టీమ్ కు కీలక హామీ ఇచ్చింది. వారి భద్రత, సౌకర్యాలకు భారత్ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.
బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణం ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయి బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా , నీరవ్ మోదీ, సంజయ్ భండారీ. అయితే వీరిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూకే అధికారులు దిల్లీలోని తీహార్ జైలును సందర్శించారు. జైలులో భద్రత, ఖైదీలకు అందించే సౌకర్యాలను సమీక్షించింది. తీహార్ జైలులో ఉన్న సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవేనని బ్రిటన్ అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా , నీరవ్ మోదీ, సంజయ్ భండారీలను యూకే ప్రభుత్వం భారత్ కు అప్పగించేందుకు కీలక ముందడుగు పడినట్లుగా భావించవచ్చు. ఇదే విషయంపై భారత ప్రభుత్వం యూకే టీమ్ కు కీలక హామీ ఇచ్చింది. వారి భద్రత, సౌకర్యాలకు భారత్ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత జైళ్లలో భద్రతా వివరాలను యూకే టీమ్ కు వివరించారు.

ఇక భారత్ లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసిన విజయ్ మాల్యా 2016లో లండన్ పారిపోయాడు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన నీరవ్ మోదీ ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. అతను కూడా విదేశాలకు పారిపోయాడు. ఇక ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications