వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా ఉక్రెయిన్ శాంతి స్థాపన అమెరికా ఇండియాతోనే సాధ్యం..?: బైడెన్‌తో మోడీ వర్చువల్ మీట్

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్య అధినేత జో బైడెన్‌తో ప్రధాని మోడీ వర్చువల్‌గా మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పౌరుల భద్రతకు భారత్ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. మానవత సాయం చేసిందని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి భారత్ వైఖరి గురించి అమెరికా అడుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి వీడియో కాల్‌లో బైడెన్ అడిగారు. ఉక్రెయిన్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.

20 వేల మంది

20 వేల మంది


కొద్దీ వారాల క్రితం ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది భారతీయులు స్వదేశం తిరిగి వచ్చారు. వారిలో చాలా మంది యువత (విద్యార్థులు) ఉన్నారు. ఇటీవల బుకాలో అమాయక జనం మరణంపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనను వెంటనే ఖండించామని.. నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశామని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొంటుందని మోడీ ఆకాంక్షించారు. బుకా వీధుల్లో వందలాది మంది మృతదేహాలు కనిపించాయి. అవీ హృదయ విదారకరంగా ఉన్నాయి. రష్యా చేసిన ఈ చర్యను అంతర్జాతీయ సమాజం ఖండించింది.

 పుతిన్‌తో మాట్లాడా..

పుతిన్‌తో మాట్లాడా..


రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులతో చాలా సార్లు ఫోన్‌లో మాట్లాడానని బైడెన్‌తో మోడీ చెప్పారు. శాంతి కోసం పాటుపడాలని కోరానని.. అంతేకాదు జెలెన్ స్కీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని పుతిన్‌ను కోరానని చెప్పారు. తమకు ఉక్రెయిన్ పౌరుల భద్రత ముక్యం అని.. అందుకోసం అవసరమైన వైద్య సామాగ్రిని అందజేశామని తెలిపారు. మందులు, ఇతర పరికరాలు కూడా పంపించామని తెలిపారు. త్వరలో మరో మందులతో కూడిన బాక్సులను పంపిస్తామని తెలిపారు.

కీ రోల్

కీ రోల్


గతేడాది వాషింగ్టన్ వచ్చిన సమయంలో మీరు చెప్పినట్టు.. ఇండియా వాషింగ్టన్ అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటాయని అన్నారని గుర్తుచేశారు. దానిని పూర్తిగా అంగీకరిస్తున్నానని మోడీ చెప్పారు. ప్రపంచలో అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలు కలిసి రష్యా ఉక్రెయిన్ యుద్దం విరమింపజేసే ప్రయత్నాలు చేస్తాయని తెలిపారు. మీరు చెప్పినట్టు డెమోక్రసీ కన్ డెలివర్ అని మోడీ అన్నారు. వీరిద్దరూ గత మార్చిలో క్వాడ్ సదస్సులో కలిశారు. ఇప్పుడు మరోసారి వర్చువల్‌గా మాట్లాడారు.

English summary
India placed importance on the safety of the civilian population in Ukraine and the uninterrupted supply of humanitarian aid to them, Prime Minister Narendra Modi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X