రామమందిరం కోసం జైలుకైనా వెళ్తా లేదా ఉరేసుకొంటా : ఉమాభారతి సంచలనం
రామమందిరం విశ్వాసానికి సంబందించిన అంశమని, మందిరం కోసం తాను జైలుకు వెళ్ళేందుకు కూడ సిద్దమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్నో: రామమందిరం విశ్వాసానికి సంబందించిన అంశమని, మందిరం కోసం తాను జైలుకు వెళ్ళేందుకు కూడ సిద్దమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారంనాడు ఆమె ఉత్తర్ ప్రదేశ్ సిఎం ఆదిత్యనాధ్ ను కలిశారు. రామ మందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు.
అయితే దానిపై తనకెంతో గౌరవం ఉందని కేంద్ర మంత్రి ఉమా భారతి చెప్పారు.మందిరం కోసం జైలుకు వెళ్ళడానికి లేదా ఉరేసుకోవడానికైనా సిద్దమని చెప్పారు.
రామమందిరంపై చర్చించాల్సిందేమీ లేదన్నారు. ఈ అంశం తమకేమీ కొత్త కాదన్నారు. రామమందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు ఆవైద్యనాథ్ నాయకుడు అన్నారు.












Click it and Unblock the Notifications