వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Teesta Setalvad : తీస్తా సెతల్వాద్ అరెస్టుపై విమర్శల వెల్లువ- అక్రమమన్న ఐరాస హక్కుల విభాగం

|
Google Oneindia TeluguNews

2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇందులో పోరాడి ఓడిన హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ తో పాుట మరో ఇద్దరు బ్యూరోక్రాట్లను గుజరాత్ ఏటీఎస్ వేధిస్తోంది. వీరిపై ఇతరత్రా కేసులు పెట్టి కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన హక్కుల్ని కాపాడుకోవడం నేరమీమీ కాదంటూ ఇప్పుడు ఐరాస మానవహక్కుల విభాగం కూడా స్పందించింది. సినీనటుడు ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా సుప్రీంకోర్టుకు ఆధారాలు కనిపించలేదా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

తీస్తా సెతల్వాద్ పై వేధింపులు

తీస్తా సెతల్వాద్ పై వేధింపులు

గుజరాత్ లో 2002లో చోటు చేసుకున్న మత ఘర్షణల్లో వేలాది మంది చనిపోయారు. ఇందులో బాధితురాలిగా మారిన కాంగ్రెస్ ఎంపీ భార్య జకియా జాఫ్రీ తరఫున న్యాయపోరాటం చేసిన తీస్తా సెతల్వాద్ అందులో విఫలమయ్యారు. ఈ కేసులో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీస్తా చేసిన న్యాయపోరాటం విఫలం కావడంతో ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇప్పుడు కస్టడీ విచారణకు సిద్దమవుతున్నారు.

 తీస్తా అరెస్టు అక్రమమన్న ఐరాస

తీస్తా అరెస్టు అక్రమమన్న ఐరాస

హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టును, ఆమెకు పోలీసు కస్టడీకి ఇవ్వడాన్ని ఐరాస మానవ హక్కుల విభాగం తప్పుబట్టింది. తీస్తా అరెస్టుపై ఐరాస మానవ హక్కులవిభాగం అధికారి మేరీ లాలర్ తీవ్రంగా స్పందించారు. హక్కుల్ని కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం నేరమేమీ కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఆమెతో పాటు దేశంలోనూ పలు రాష్ట్రాల్లో మానవ హక్కుల సంస్ధలు, ప్రజాసంఘాలు తీస్తా అరెస్టును తప్పుబడుతున్నాయి. ప్రధాని మోడీపై న్యాయపోరాటం చేసినంత మాత్రాన ఆమెపై కక్షసాధిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నాయి.

ప్రకాష్ రాజ్ ట్వీట్

గుజరాత్ అల్లర్ల వెనుక కుట్ర ఉందని నిర్దారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించడంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో బయటపడిన ఓ వీడియోను రవి నాయర్ అనే జర్నలిస్టు ట్వీట్ టేసిన వీడియోను ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేశారు. ఇందులో అల్లర్ల సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎలా వ్యవహరించారో ఓ నేత వివరిస్తున్నారు. మరోవైపు అల్లర్లలో పోలీసుల కాల్పులు, ఇతర ఘటనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ట్వీట్ లో రవినాయర్ మన సుప్రీంకోర్టు వీటిని ఆధారాలుగా నమ్మలేదంటూ వ్యాఖ్యానించారు.

English summary
un human right official condemned the arrest and police custody to social activist teesta setalvad's after supreme court verdict on 2002 gujarat riots case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X