ఇంద్రాణి సీక్రెట్ బ్యాంక్ ఖాతాలు: పీటర్ షాక్
ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితురాలైన తన భార్య ఇంద్రాణి ముఖార్జియా సీక్రెట్ బ్యాంక్ ఖాతాలు నిర్వహించిందని తెలుసుకుని మీడియా ప్రముఖుడు పీటర్ ముఖార్జియా బిత్తరపోయారు. షీనా బొరా హత్యోదంతం వెలుగు చూసిన తర్వాత ఆయన ఇంద్రాణికి దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారు.
ఇంద్రాణి ముఖార్జియా సీక్రెట్ బ్యాంక్ ఖాతాలు నిర్వహించిందని తెలిసి తాను షాక్ తిన్నట్లు పీటర్ పోలీసులతో అన్నారు. పీటర్, ఇంద్రాణిల పేర్ల మీద పది జాయింట్ ఖాతాలున్నాయని, వాటిలో మూడు ఎన్నారై, ఒక్కటి ఓవర్సీస్ ఖాతాలని సమాచారం. ఇంద్రాణి సొంతంగా నాలుగు బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో రెండు ఓవర్సీస్ ఖాతాలు. వీటి గురించి పీటర్‌కు ఏ మాత్రం సమాచారం లేదు.

ఇంద్రాణి, పీటర్లకు ముంబై, ఢిల్లీల్లోని హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, స్టాండర్డ్ చార్టర్డ్ సిటీ, ఎస్‌బిఐల్లో ఖాతాలున్నాయి. పీటర్‌కు చెప్పకుండా ఇంద్రాణి ఈ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచినట్లు దర్యాప్తులో తేలింది. ఇంద్రాణికి 70 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. వాటికి నామినీ కూతురు విధి.
బుధవారంనాడు పీటర్ ముఖార్జియాను ఖర్ పోలీసు స్టేషన్‌లో పది గంటల పాటు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. అదే పోలీసు స్టేషన్‌లో ఇంద్రాణి ఉన్నప్పటికీ ఆమె చూస్తానని పీటర్ అడగలేదు. ఆమె సమక్షంలో తనను ప్రశ్నించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు.
తన కూతురు షీనా బొరాను హత్య చేసిందనే ఆరోపణపై పోలీసులు ఇంద్రాణి ముఖార్జియాను పోలీసులు గత వారం అరెస్టు చేశారు. తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు అధికారులు వేసిన పలు ప్రశ్నలకు పీటర్ సమాధానాలు ఇవ్వలేకపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications