లష్కరే కుట్ర: ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలు టార్గెట్

ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నాయకులను హత్య చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని పాకిస్థాన్ కు చెందిన లష్కరే-ఏ-తోయిబా ఉగ్రవాదులు కుట్రపన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నాయకులను హత్య చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని పాకిస్థాన్ కు చెందిన లష్కరే-ఏ-తోయిబా ఉగ్రవాదులు కుట్రపన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

2017లో ఉత్తర భారతదేశంలో జరిగే శాసన సభ ఎన్నికలకు ముందే ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నాయకులను హత్య చెయ్యడానికి ఉగ్రవాదులు కుట్రపన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. లష్కరేతో సంబంధాలు ఉన్న సిక్కు ఉగ్రవాదులు ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలను టార్గెట్ చేసుకుంటున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో ఉంటున్న ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీకి చెందిన ప్రముఖులను టార్గెట్ చేసుకున్నారని తెలుసుకున్న ఇంటిలిజెన్స్ వర్గాలు సంబంధిత అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.

Under the radar of Sikh militants and the Lashkar-e-Taiba are VHP and RSS leaders.

సిక్కు ఉగ్రవాదులు హిందూ ప్రముఖ నాయకుల మీద దాడులు చేస్తే లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు చెయ్యడానికి పక్కా ప్లాన్ వేసుకుంటున్నారని అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.

ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తే శాంతి భద్రతలు లోపించి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే మతఘర్షణలు జరుగుతాయని ఉగ్రవాదుల అసలు ప్లాన్ అని ఇంటిలిజెన్స్ అధికారులు అంటున్నారు.

ఉగ్రవాదులను భారత్ లోకి పంపించడానికి సరైన సమయం కోసం లష్కరే ఎదురుచూస్తుందని వెలుగు చూసింది. సిక్కు ఉగ్రవాదులు భారత్ లో దాడులు చేసే అవకాశం ఉందని ఇప్పటికే అనేక సార్లు చర్చ జరిగింది.

భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ లో అంతం చెయ్యడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదులు రగిలిపోతున్నారని అధికారులు అంటున్నారు. డిసెంబర్ లో కాశ్మీర్ లో దాడులు చెయ్యాలని లష్కరే-ఏ-తోయిబా లక్షంగా పెట్టుకుందని, అలాంటి చాన్స్ వారికి ఇవ్వమని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+