ప్రతీకారం: చెన్నైలో ఏటీఎంలు ధ్వంసం, రేపు బంద్ !
చెన్నై: కావేరీ జలాల గొడవ ఇప్పుడు తమిళనాడుకు చేరింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఉన్న తమిళ ప్రజలకు భద్రత కల్పించాలని తమిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు వాహనాలు ధ్వంసం చెయ్యడాన్ని ఖండిస్తూ గురువారం తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చారు.
తమిళనాడుకు చెందిన బస్సులు, లారీలు, కార్లు, ట్రక్కులను కన్నడిగులు ధ్వంసం చేశారని తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యచరణ కమిటీ అధ్యక్షుడు ధనపాలన్ ఆరోపించారు.
కర్ణాటక తీరును ఖండిస్తూ గురువారం తమిళనాడు బంద్ కు ఆయన పిలుపునిచ్చారు. బెంగళూరులో తమిళనాడు వాహనాలు దహనం చేసినందుకు ప్రతీకారంగా తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చారు.

చెన్నైలో 170 కర్ణాటక కార్యాలయాలు, 70 హోటళ్లు, 65 ఏటీఎం కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులతో గాంధీపురం నుంచి చెన్నై వెలుతున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న గరుడాలయ సంస్థ బస్సును ధ్వంసం చేశారు.
చెన్నైలోని విరుగంబాక్కంలోని కర్ణాటక బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. తంగశాలై ప్రాంతంలో వేకువ జామున హెల్మెట్ లు వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు కర్ఱాటక బ్యాంకు ఏటీఎం కేంద్రాన్ని ధ్వంసం చేశారు.
మైలాపూర్ లోని సంగీత హోటల్ లోకి నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. శ్రీపెరంబుదూరు చెక్ పోస్టు సమీపంలో నిలిపిన కర్ణాటక లారీకి నిప్పటించి బూడిద చేశారు.
పలు కేసులలో ఇప్పటికే ఆందోళనకారులను చెన్నై, మైలాపూర్, కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications