ఉమ్మడి పౌరస్మృతి వివాదం- ముస్లింలకు ఢిల్లీ జామా మసీదు ఇమాం ఫత్వా జారీ..

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముస్లింలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం దూకుడుపై తాజాగా అత్యవసర భేటీ నిర్వహించిన ముస్లిం పర్సనల్ లాబోర్డు.. లా కమిషన్ కు విజ్ఞాపనలు అందించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో బక్రీద్ ప్రార్ధనల తర్వాత ప్రసంగంలో ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ కామన్ సివిల్ కోడ్ అమలు ప్రయత్నాలపై ముస్లింలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహంపై స్పందించారు. ఈ సందర్భంగా ముస్లిం గ్రూపులకు ఆయన ఓ ఫత్వా కూడా జారీ చేశారు. సివిల్ కోడ్ పై ముస్లిం గ్రూపులు మౌనంగా ఉండాలని ఆయన కోరారు. ఓవైపు లా కమిషన్ సివిల్ కోడ్ పై అభ్యంతరాలు స్వీకరిస్తున్న తరుణంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.

delhijamamasjidsshahi

అదే సమయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రభుత్వ వైఖరిని విమర్శించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తమకు ప్రత్యేక హక్కు ఉందని, ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుని బోర్డును రద్దు చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. ఇప్పటివరకూ నెలకొన్న పరిస్ధితులు ఎవరికీ హాని కలిగించలేదని, కానీ కేంద్రం మాత్రం సమాజంలో శాంతి, సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్‌ను బహిరంగంగా వ్యతిరేకించకూడదనే వ్యూహాత్మక దృక్పథాన్ని ముస్లిం నాయకులు, సంస్థలు తీసుకున్నాయని, ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని తెలుస్తోంది. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జూలై 3న తన సమావేశంలో సివిల్ కోడ్ పై అందరి అభిప్రాయాలు కోరింది. మంగళవారం సాయంత్రం వరకు లా కమిషన్ ప్యానెల్ తన పబ్లిక్ నోటీసుపై దాదాపు 8.5 లక్షల ప్రతిస్పందనలను అందుకున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+