యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్: కీలక వివరాలు
భారతదేశంలో ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించబోతోంది. వచ్చే ఏడాది జనవరి(2025) నాటికి యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డుల్లోకెక్కనుంది. విభిన్నమైన చట్టాలలో చట్టపరమైన ఏకరూపతకు తీసుకువచ్చేందుకు ఇదొక కీలక ముందడుగు అని చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ప్రభుత్వం యూసీసీని అమలు చేయడం ద్వారా ప్రజలు వారి మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం కోసం పౌరులందరినీ ఒకే చోటికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వచ్చే ఏడాది నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు నాయకత్వం వహించడం ద్వారా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అసాధారణమైన ధైర్యం, దూరదృష్టిని ప్రదర్శించారని చెప్పవచ్చు. ఈ చారిత్రాత్మక నిర్ణయం పౌరులందరి ప్రయోజనం కోసం సమానత్వాన్ని పెంపొందించడానికి, విభిన్న వ్యక్తిగత చట్టాలను క్రమబద్ధీకరించడానికి సీఎం పుష్కర్ సింగ్ ధామి నిబద్ధతను ప్రతిబింబించేలా ఉంది.

ఇలాంటి సంక్లిష్టమైన, సున్నితమైన సమస్యను ధీటుగా పరిష్కరించడం ద్వారా.. సామాజిక సామరస్యం, న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ ధైర్యమైన నాయకత్వానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక ఉదాహరణగా నిలిచారు. ఆయన దూరదృష్టితో కూడిన ఈ నిర్ణయం ఆధునిక పాలనలో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది. ఇతర రాష్ట్రాలను కలుపుకునిపోయేందుకు, చట్టపరమైన ఏకరూపకతను స్వీకరించడానికి స్ఫూర్తినిస్తోంది.
యూసీసీ అమలైతే వచ్చే మార్పులు:
వివాహం, విడాకుల సంస్కరణలు:
అన్ని కమ్యూనిటలలోనూ బహు భార్యత్వం నిషేధం
త్రిపుల్ తలాక్, ఖులా, జిహర్ వంటి పద్దతులతో సహా న్యాయ విరుద్ధమైన విడాకులు నేరంగా పరిగణిస్తారు.
ఎవరి మతాలు, ఆచారాల ప్రకారం వారు జరుపుకునే వివాహాలకు గుర్తింపు లభిస్తుంది.
వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి:
జంటలు వివాహం చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేయని పక్షంలో రూ. 25 వేలు జరిమానా విధిస్తారు.
రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సహజీవనం చేస్తే జైలు తప్పదు.
రిజిస్ట్రేషన్ రికార్డులన్నీ ప్రజలు పరిశీలించేందుకు వీలుగా ఉంటాయి. బహు భార్యత్వం, మోసాలను నివారించేందుకు, వేర్వేరు మతాలు, వేర్వేరు కులాలకు సంబంధించిన జంటలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉండటంతో ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
చైల్డ్ కస్టడీ, గార్డియన్‌షిప్:
తండ్రులుచట్టపరమైన సంరక్ష హోదాను కలిగి ఉంటారు. తల్లులు సంరక్షకులుగా నియమిస్తారు.
ఐదేళ్ల లోపు చిన్నారుల సంరక్షణ బాధ్యతను తల్లులకే అప్పగించడం జరుగుతుంది.
సహజీవనం, ఇతర సంబంధాలు కలిగి ఉండటం వల్ల జన్మించిన ప్రతీ శిశువు సమాన హక్కులను కలిగి ఉంటారు.
దత్తత విధానం:
హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్ దత్తత విధానాలకు మార్గదర్శకంగా ఉంటాయి.
యూసీసీ హిందూ దత్తతలను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేయలేదు. దీంతో సమగ్ర సంస్కరణకు అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత చట్టాలు, ఆచారాలు:
పునర్ వివాహానికి షరతులు విధించే సంప్రదాయ పద్ధతులను చట్ట విరుద్ధం చేసింది.
పంచాయతీ విడాకులు వంటి స్థానిక పద్ధతులు కూడా నేరంగా పరిగణిస్తారు.
వివాహ రద్దు సందర్భాల్లో మెహర్, నిర్వహణ కోసం ప్రోవిజన్లను కొనసాగించింది.
మెరుగైన నిఘా, శిక్షలు:
మైనార్టీ కమ్యూనిటీ విషయంలో జరిగే చట్టాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలను ప్రస్తావించింది.
యూసీసీ మతపరమైన, సాంస్కృతిక పద్ధతులను అసమానంగా ప్రభావితం చేస్తుందని విమర్శలు పేర్కొన్నారు.
యూసీసీ ఎందుకు ముఖ్యమైనది అంటే?
యూసీసీ భిన్నమైన చట్టాలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తుంది. ప్రస్తుతం హిందూ వివాహ చట్టం, షరియత్ చట్టం, క్రిస్టియన్ వివాహ చట్టం వంటి విభిన్న మతపరమైన చట్టాలు అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సమానత్వాన్ని నిర్ధారించడం, లింగ న్యాయాన్ని ప్రోత్సహించడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం యూసీసీ లక్ష్యాలుగా ఉన్నాయి.
సవాళ్లు, ఆందోళనలు:
యూసీసీ అమలు ఎన్నో సవాళ్లతో కూడుకున్నదే.
యూసీసీ ఎక్కువగా మైనార్టీలను లక్ష్యం చేసుకుని రూపొందించిన చట్టమని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. లింగ సమానత్వాన్ని ప్రస్తావించడం లేదని, తండ్రులను ప్రాథమికంగా సంరక్షకులుగా మాత్రమే గుర్తిస్తుందని అంటున్నారు.
దారి చూపుతుందా?:
ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీని అమలు చేయడం చట్టబద్ధమైన ఏకరూపత వైపు ఒక సాహసోపేతమైన చర్యే. అయితే, దాని అమలుకు ఏ కమ్యూనిటీని దూరం చేయకుండా ఉండేందుకు ఖచ్చితమైన అమలు ఎంతో అవసరమనే చెప్పాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అన్ని వర్గాలను సమన్వయపరుస్తూ యూసీసీని సమర్థవంతంగా అమలు చేస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత అంశంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications