మోడీ మాటంటే: కారు నిలిపిన కేంద్ర మంత్రి, గోడ పక్కనే పోశారు, సెక్యూరిటీ ఇలా, వైరల్ !
భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చభారత్ నినాదం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చెయ్యరాదని పిలుపునిస్తున్నారు.
న్యూఢిల్లి: భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చభారత్ నినాదం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చెయ్యరాదని పిలుపునిస్తున్నారు. మలమూత్ర విసర్జన చెయ్యడానికి కేవలం బాత్ రూంలు మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు మనవి చేస్తున్నారు.
అనేక మంది సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, సినీ దర్శకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారి సొంత నిధులతో పేద ప్రజలకు ఉచితంగా బాత్ రూంలు నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఓ కేంద్ర మంత్రి బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట కేంద్ర మంత్రులే పట్టించుకోవడం లేదని, ఇక సామాన్య ప్రజలు ఏమి పట్టించుకుంటారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ప్రధాని ఆశయం
దేశంలో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా మలమూత్ర విసర్జన చెయ్యకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్షంగా పెట్టుకున్నారు. స్వచ్చభారత్ పేరుతో పట్టణాలు, గ్రామాల్లో బాత్ రూంలు లేని ప్రజలకు ప్రభుత్వం బాత్ రూంలు నిర్మిస్తోంది.
కేంద్ర మంత్రి
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బీహార్ లోని చంపారణ్య ప్రాంతంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా చంపారణ్య నియోజక వర్గంలోని మోతీహరి అనే ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కారు దిగిన కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ సెక్యూరిటీని అక్కడే ఉండాలని సూచించారు.
నేరుగా గోడ దగ్గరకు వెళ్లి
కారు దిగిన కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ నేరుగా ఓ గోడ దగ్గరకు వెళ్లారు. తరువాత గోడ పక్కన హాయిగా మూత్రవిసర్జన చేశారు. ఆ సందర్బంలో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తిరిగి నిలబడి ఉన్నారు. మూత్రవిసర్జన చేసిన తరువాత మంత్రి రాధామోహన్ సింగ్ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ నేరుగా కారులో వచ్చి కుర్చున్నారు.

ఫోటోలు వైరల్ అయ్యాయి
కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చెయ్యడం, తిరిగి కారు దగ్గరకు వస్తున్న సమయంలో ఫోటోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఇప్పుడు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ బీహార్ పర్యటన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పేదలకే కాదు కేంద్ర మంత్రికి సమస్య !
కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మూత్రవిసర్జన చెయ్యడానికి పేదలు బాత్ రూంలు లేక ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలుసని, అయితే ఆ సమస్య సాక్షాత్తు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ కు ఉందని ఇప్పుడే తెలిసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications