వచ్చే మూడేళ్ళలో 400 వందేభారత్ న్యూజనరేషన్ రైళ్ళు; రైతులకు రైల్వే కార్గో సేవలు: నిర్మలాసీతారామన్
దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టాక్స్ రిటర్న్స్ అప్డేట్ చేసుకోవడానికి రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు నిర్మలాసీతారామన్ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇదే సమయంలో దేశ అభివృద్ధి పై, దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే విషయాలపై దృష్టి సారించిన బడ్జెట్లో, వచ్చే మూడేళ్లలో భారత్ 400 కొత్త, ఇంధన-సమర్థవంతమైన వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలో రైల్వే రంగాన్ని కొత్త పుంతలు తొక్కించటంలో భాగంగా నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
Recommended Video

రైల్వేపై ఫోకస్ చేసిన కేంద్రం .. వందే భారత్ రైల్లపై ఆర్ధిక మంత్రి ప్రకటన
ఎన్డీఏ సర్కారు ఈ సారి కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంపై దృష్టి సారించిందని నిర్మల సీతారామన్ చేసిన తాజా ప్రకటనతో తేలింది. కేంద్రంలో మోదీ సర్కార్ కొలువుదీరిన తర్వాత కొత్త రైళ్లు స్టార్ చేయడం కంటే నూతనరైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. అయితే గతానికి భిన్నంగా వందే భారత్ పేరుతో భారీగా రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే వరుసగా 75 వారాల పాటు75 వందే భారత్ రైళ్లను నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రి వందే భారత రైళ్లపై ప్రకటన చేశారు.

400 న్యూ జనరేషన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు నిర్మల సీతారామన్ వెల్లడి
మూడేళ్లలో కొత్తగా 400 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. వివిధ కొత్త నగరాలను, ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ పేరుతో 400 న్యూ జనరేషన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు నిర్మల సీతారామన్ వెల్లడించారు. బహుళ నగరాలకు సులభంగా యాక్సెస్ చేసేలా వీటిని రూపొందిస్తున్నామని నిర్మల సీతారామన్ తెలిపారు. తాజా ప్రకటనతో రైల్వేలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరుగుతాయని, రైల్వే రంగంలో ఉపాధి పెరుగుతుందని నిర్మల సీతారామన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొత్తగా వచ్చే రైళ్ళలో ఏపీ, తెలంగాణాలకు వాటా
కొత్తగా వచ్చే వందే భారత్ రైళ్లను పూర్తిగా ఎల్‌ఎఫ్‌బీ కోచ్‌లతో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ, కపుర్తాల, చెన్నైలలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీలలో ఎల్‌ఎఫ్‌బీ కోచ్‌లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాల నంచి దేశరాజధాని ఢిల్లీకి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చే వందే భారత్ రైళ్లలో తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుంది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్గో సేవలు
వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎరువుల సరఫరాకే రైల్వే నెట్‌వర్క్ ఉపయోగపడుతోంది. ఇక ముందు ముందు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా రైల్వే నెట్వర్క్ ఉపయోగిస్తామని ఆమె పేర్కొన్నారు. కరోనా సంక్షోభం వచ్చాక రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పెద్ద ఎత్తున చేపట్టారని పేర్కొన్నారు నిర్మలాసీతారామన్. తద్వారా వచ్చిన ఫలితాలు బాగా ఉన్నాయని, ఈసారి చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్గో సేవలు ప్రారంభిస్తామన్నారు.

దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్ నిర్మించబోతున్నామన్న నిర్మల సీతారామన్
ఈ మేరకు పీఎం గతి శక్తి ద్వారా దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్ నిర్మించబోతున్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ రైళ్లు శతాబ్ది కంటే వేగం, మెట్రో ను మించిన టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత రైళ్లు అందుబాటులోకి వస్తే దేశంలో రైల్వే స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. రైళ్ళల్లో పూర్తిగా రివాల్వింగ్ చైర్లు, ఏసీ కోచ్లు, బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ డోర్లు, భోజన సదుపాయాలు, వైఫై ఫెసిలిటీ, ఇతర హైటెక్ ఫీచర్స్ కూడా ఉండనున్నాయి.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications