వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ది విభజించి పాలించే ఫార్ములా... అందుకే అధికారంకు దూరమైంది: ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23కు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌ కామన్‌ మ్యాన్‌కు నిరాశే కలిగించింది. బడ్జెట్ మొత్తం డిజిటలైజేషన్ పైనే ఫోకస్ చేసినట్లుగా అనిపించింది. నిర్మలమ్మ బడ్జెట్ విజనరీ బడ్జెట్‌గా కొందరు కొనియాడగా... విపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోశాయి. ఇక అంతకుముందు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం రోజున ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడతారు. ఈ సందర్భంగా మోదీ విపక్షాలు చేసిన విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి మోదీ విపక్షాల విమర్శలకు ఎలాంటి సమాధానం ఇస్తారు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్లమెంటు వేదికగా మోదీ ఎలాంటి చాణక్యతను ప్రదర్శిస్తారు అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఇక పార్లమెంటులో మోదీ ప్రసంగం మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Union Budget 2022 Live Updates In Telugu:PM Modi to reply on Presidential address debate

Newest First Oldest First
7:07 PM, 7 Feb

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ముగిసిన ప్రధాని ప్రసంగం
7:05 PM, 7 Feb

కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకునే సమయం వచ్చింది. అంతా కలిసి కట్టుగా దేశాభివృద్ధికి పనిచేయాలి:ప్రధాని మోదీ
7:01 PM, 7 Feb

నెహ్రూ చెప్పారు.. స్వాతంత్య్రంతో బాధ్యత వస్తుందని: ప్రధాని మోదీ
7:00 PM, 7 Feb

కొందరు నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు:ప్రధాని మోదీ
6:58 PM, 7 Feb

భారత్‌ను విభజించేందుకు కాంగ్రెస్ విత్తనం నాటుతోంది:ప్రధాని మోదీ
6:57 PM, 7 Feb

దేశాన్ని పాలించే అధికారం కాంగ్రెస్‌ కోల్పోయింది.ఇకపై రాదుకూడా: ప్రధాని మోదీ
6:57 PM, 7 Feb

చిచ్చు పెట్టడంలో కూడా కాంగ్రెస్‌ ఓడిపోయింది:ప్రధాని మోదీ
6:54 PM, 7 Feb

సీడీఎస్ రావత్ భౌతికకాయం తీసుకెళుతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు పెట్టుకున్న తమిళులు వీర్ వణక్కం అంటూ నినదించారు.ఇది నాదేశం: ప్రధాని మోదీ
6:52 PM, 7 Feb

తమిళ సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది:ప్రధాని మోదీ
6:51 PM, 7 Feb

దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ అభిమతం: ప్రధాని మోదీ
6:51 PM, 7 Feb

దేశ వారసత్వంపై కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదం: ప్రధాని మోదీ
6:46 PM, 7 Feb

కొందరు దేశం గురించి మాట్లాడే ధైర్యం చేస్తున్నారు: రాహుల్ పై పరోక్షంగా మండిపడ్డ ప్రధాని మోదీ
6:44 PM, 7 Feb

పేదరికం ఒక నినాదంగానే మిగిలిపోయింది తప్ప.. దానిపై పోరాటం అనేది ఎక్కడా కనిపించలేదు:ప్రధాని మోదీ
6:43 PM, 7 Feb

పేదరికంపై మాట్లాడతారు.. ఆ తర్వాత పారిపోతారు: కాంగ్రెస్ పై ప్రధాని ఫైర్
6:43 PM, 7 Feb

1971 నుంచి పేదరికంపై కాంగ్రెస్ ప్రచారం చేస్తూనే ఉంది: ప్రధాని మోదీ
6:42 PM, 7 Feb

అమెరికాలో అంతర్గతంగా ఏమైనా జరిగితే భారత్‌లో ద్రవ్యోల్బణం పడిపోతుందని నెహ్రూ చెప్పేవారు: ప్రధాని మోదీ
6:39 PM, 7 Feb

ద్రవ్యోల్బణంను సమర్థించుకునేందుకు కొరియా యుద్ధంను సాకుగా చూపారు తొలి ప్రధాని నెహ్రూ: ప్రధాని మోదీ
6:36 PM, 7 Feb

కరోనా సమయంలోను ద్రవోల్బణం స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది: ప్రధాని మోదీ
6:36 PM, 7 Feb

ద్రవ్యోల్బణంపై పోరు ప్రభుత్వం యొక్క కీలక అంశం
6:34 PM, 7 Feb

ఒక్కసారి రికార్డులను తిరిగేయాలని చిదంబరంను కోరుతున్నాను: ప్రధాని మోదీ
6:33 PM, 7 Feb

మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు: ప్రధాని మోదీ
6:33 PM, 7 Feb

భవిష్యత్తులో రక్షణ వ్యవస్థలో భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా మారనుంది:ప్రధాని మోదీ
6:32 PM, 7 Feb

భారత్‌కు డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్ చాలా కీలకం: ప్రధాని మోదీ
6:31 PM, 7 Feb

ఓవర్సీస్ నుంచి డిఫెన్స్ వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ చేసింది: ప్రధాని మోదీ
6:29 PM, 7 Feb

మేకిన్ ఇండియా కమిషన్ల వ్యవస్థకు చెక్ పెట్టింది: ప్రధాని మోదీ
6:28 PM, 7 Feb

మేకిన్ ఇండియాను విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు జోక్ ఇన్ ఇండియాగా తయారైంది:ప్రధాని మోదీ
6:26 PM, 7 Feb

రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ
6:24 PM, 7 Feb

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే అదే చరిత్రలో కలిసిపోతారు: ప్రధాని మోదీ
6:23 PM, 7 Feb

మోదీ పేరును తలుచుకోకుండా ఒక్కరోజు కూడా విపక్ష పార్టీలు ఉండలేవు: ప్రధాని మోదీ
6:22 PM, 7 Feb

విపక్షాలు మోదీ పేరును పటించకుండా ఒక్క క్షణం కూడా బతకలేరు:ప్రధాని మోదీ
READ MORE

English summary
Union Budget 2022 Live Updates In Telugu:Finance Minister Nirmala sitharaman is all set to present her fourth Union Budget on February 1st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X