హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా!

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కూడా పలు కేటాయింపులు ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24ను బుధవారం ఉదయం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం అని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. మరోవైపు, దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఈ బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పేదలు, సామాన్యులు, రైతుల బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.

ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కూడా పలు కేటాయింపులు ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి..

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ సంస్థలకు కేటాయింపులు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ: రూ. 47 కోట్లు
పెంట్రోలియం యూనివర్సిటీ: రూ. 168 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్: రూ. 683 కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సంస్థలకు కేటాయింపులు ఇలా

సింగరేణికి రూ. 1650 కోట్లు
మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ. 1473 కోట్లు
ఐఐటీ హైదరాబాద్ కు రూ. 300 కోట్లు కేటాయించారు.

Union budget 2023: allocations to andhra pradesh and telangana states

ఏపీ, తెలంగాణకు ఉమ్మడి కేటాయింపులు ఇలా

రెండు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ. 37 కోట్లు
మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ. 6835 కోట్లు
సాలార్జంగ్ సహ ఇతర అన్ని మ్యూజియాలకు రూ. 357 కోట్లు

English summary
Union budget 2023: allocations to andhra pradesh and telangana states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X