వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!

బడ్జెట్ లో మహిళలకు కొత్త స్కీమ్ ప్రకటించారు నిర్మలా సీతారామన్. సీనియర్ సిటిజన్లకు డిపాజిట్ పరిమితి పెంచి, గృహ కొనుగోలుదారులకు పీఎం ఆవాస్ యోజన నిధులు పెంచి శుభవార్త చెప్పారు.

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు శుభవార్త చెప్పారు. మహిళా సాధికారత లక్ష్యంగా అనేక చర్యలను చేపట్టినట్టు పేర్కొన్న నిర్మల సీతారామన్ ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చినట్టుగా వెల్లడించారు.

మహిళల ఆర్ధిక లబ్ది కోసం కొత్త పథకం

మహిళల ఆర్ధిక లబ్ది కోసం కొత్త పథకం


మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ను తీసుకు వస్తున్నట్లుగా నిర్మల సీతారామన్ పేర్కొన్నారు రెండేళ్ల కాలానికి ఈ బతుకు అందుబాటులో ఉంటుందని ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ పై 7.5% స్థిర వడ్డీ ఉంటుందని, గరిష్టంగా మహిళలు ఇందులో రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని దీని ద్వారా మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని నిర్మల సీతారామన్ వెల్లడించారు.

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్


ఇక ఇదే సమయంలో సీనియర్ సిటిజన్ల కోసం కూడా గుడ్ న్యూస్ చెప్పిన నిర్మల సీతారామన్ సీనియర్ సిటిజన్స్ కు పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితిని పెంచుతున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం 15 లక్షల వరకు ఉన్న పరిమితిని రెట్టింపు చేసి 30 లక్షలకు పెంచుతున్నట్టుగా నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. మొత్తం గంట 26 నిమిషాల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ ఇది అమృతకాల తొలి బడ్జెట్ అని ప్రసంగించారు. బడ్జెట్లో వేతన జీవులకు ఊరటను ఇస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని వెల్లడించారు.

నూతన గృహ నిర్మాణాలు, కొనుగోలు చేసే వారికి శుభవార్త

నూతన గృహ నిర్మాణాలు, కొనుగోలు చేసే వారికి శుభవార్త


ఇక అంతే కాదు కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పారు నిర్మల సీతారామన్. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి, కట్టుకోవాలి అనుకునే వారికి పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. బడ్జెట్లో ఈ మేరకు నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజన పథకానికి కేటాయించిన నిధుల కంటే ఈసారి పీఎం ఆవాస్ యోజన పథకానికి 66% ఎక్కువ నిధులను కేటాయించారు.

భారీగా పీఎం ఆవాస్ యోజన నిధులను పెంచిన కేంద్రం

భారీగా పీఎం ఆవాస్ యోజన నిధులను పెంచిన కేంద్రం


గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే, ఈ ఏడాది 79 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. గృహ నిర్మాణాలు చేయాలనుకున్నవారు, కొనుగోలు చేయాలనుకున్నవారు బ్యాంకులలో రుణాలు తీసుకుంటున్న వేళ విపరీతంగా వడ్డీ రేట్లతో ఇబ్బందులు పడుతున్న సమయంలో, గృహ కొనుగోలుదారులకు పీఎం ఆవాస్ యోజన పథకం నిధులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గృహ కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. మొత్తంగా చూస్తే ఈసారి బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు లబ్ధిని చేకూరుస్తూ వేతన జీవుల బడ్జెట్ గా కనిపిస్తుంది.

Union Budget 2023: సప్త ఋషుల రీతిలో 7అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత.. వ్యవసాయానికి కేటాయింపులిలా!!Union Budget 2023: సప్త ఋషుల రీతిలో 7అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత.. వ్యవసాయానికి కేటాయింపులిలా!!

English summary
Nirmala Sitharaman announced a new scheme for women in the budget. Good news for senior citizens and new home buyers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X