Income Tax: వేతన జీవులకు భారీ ఊరట-12 లక్షల వరకూ నో ట్యాక్స్-తాజా మార్పులివే..!
వేతన జీవులకు ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకూ 7 లక్షల వరకూ వార్షిక ఆదాయం కలిగిన వారికి ఎలాంటి పన్ను మినహాయింపు ఉండగా.. దాన్ని ఇప్పుడు ఏకంగా 12 లక్షలకు పెంచేశారు. దీంతో పాటు టీడీఎస్, టీసీఎస్ లోనూ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు భారీ ఊరటనిచ్చారు. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకొస్తామని ఆర్దికమంత్రి ప్రకటించారు.
12 లక్షల ఆదాయం దాటిన ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ 80 వేలుగా నిర్ణయించారు. అలాగే 18 లక్షలు దాటిన వారికి 70 వేలు, 24 లక్షలు దాటిన వారికి 1.1 లక్షల స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అలాగే 12 లక్షలు దాటిన వారికి ఆదాయపు పన్ను స్లాబ్ లు మార్చారు. వీటి ప్రకారం 0-4 లక్షలు ఆదాయానికి ఎలాంటి పన్నూ ఉండదు. 4-8 లక్షల ఆదాయానికి 5 శాతం, 8-12 లక్షల ఆదాయానికి 10 శాతం, 16-20 లక్షల ఆదాయానికి 20 శాతం, 20-24 లక్షల ఆదాయానికి 25 శాతం, 24 లక్షల కంటే మించిన ఆదాయానికి 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే 12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి ఇవి వర్తిస్తాయి. 12 లక్షల లోపు ఆదాయం ఉంటే పూర్తి మినహాయింపు ఉంటుంది.
భారతీయ న్యాయసంహిత స్ఫూర్తితో కొత్తగా ఆదాయపు పన్ను బిల్లు తీసుకొస్తామని ఆర్దిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు చేస్తామన్నారు. సగం సంక్లిష్ట అంశాలు తొలగిస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు.పన్ను చెల్లింపుదారులకు సులభతరం చేస్తామని వెల్లడించారు. లిటిగేషన్లు తగ్గించేలా కొత్త విధానం ఉంటుందని ప్రకటించారు.వ్యక్తిగత ఆదాయపు పన్ను సంస్కరణలు, మధ్యతరగతికి ఊరటనిస్తామని సంకేతాలు ఇచ్చారు.

టీడీఎస్, టీసీఎస్ వసూలు విధానంలో మార్పులు చేశారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై వచ్చే ఆదాయంపై పన్ను పరిమితి 50 వేల నుంచి 2 లక్షలకు పెంచారు. అలాగే అద్దెద్వారా వచ్చే ఆదాయంపై పన్ను పరిమితి 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు.ఆర్బీఐ విధానం ప్రకారం కంపెనీలు ఉద్యోగుల దగ్గర వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే టీసీఎస్ పరిమితిని కూడా 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ మరో నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications