వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి పార్లమెంట్‌కు త్రిబుల్ తలాక్ బిల్లు... ఆమోదించిన క్యాబినెట్...

|
Google Oneindia TeluguNews

మరోసారి త్రిబుల్ తలాఖ్ బిల్లును పార్లమెంట్‌ ముందుకు రానుంది. బిల్లును ప్రవేశ పెట్టడడం కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. దీంతో సోమవారం నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును మరోసారి ప్రవేశపెట్టనున్నారు. కాగ అంతకు ముందు సమావేశమైన కేంద్ర క్యాబినెట్ దీనిపై చర్చించింది.

గత పార్లమెంట్ సమావేశాల్లో త్రిబుల్ తలాక్ బిల్లు..

గత పార్లమెంట్ సమావేశాల్లో త్రిబుల్ తలాక్ బిల్లు..


ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ముస్లిం మహిళలు ఎదుర్కోంటున్న త్రిబుల్ తలాక్ సమస్యను రూపు మాపేందుకు కేంద్రం త్రిబుల్ తలాక్ చెల్లని విధంగా బిల్లును తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే గత లోక్‌సభ సమావేశాల్లో త్రిబుల్ తలాక్ బిల్లును ప్రవేశ పెట్టింది. దీంతో లోక్‌సభలో బిల్లు అమోదం లభించింది. కాని ఎన్నికల ముందు హడావిడిగా బిల్లును పెట్టడడంతో రాజ్యసభలో మాత్రం విపక్షాల అభ్యంతరాలతో అమోదం లభించలేదు. అనంతరం ఎన్నికలు రావడంతో లోక్‌సభ రద్దయింది

రాజ్యసభలో ఆమోదం ఈసారైన వస్తుందా

రాజ్యసభలో ఆమోదం ఈసారైన వస్తుందా


సాధరణంగా ఏదైన బిల్లు ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టినట్ట పాస్ అయినట్టయితే ఆ బిల్లు ఎగువ సభ అయిన రాజ్యసభ అమోదం కూడ పోందాలి..ఇలా రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందినప్పుడే అది చట్ట రూపంలోకి వస్తుంది. లేదంటే లోక్‌సభ రద్దయిన నేపథ్యంలో బిల్లు కూడ మురిగి పోతుంది. ఇలా లోక్‌సభలో పెట్టిన త్రిబుల్ తలాక్ బిల్లు రద్దయింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర కేబినెట్ మళ్లీ ఆమోదం తెలిపి లోక్‌సభలో ప్రవేశపెట్టాలని మోడీ సర్కారు నిర్ణయించింది

ఆర్డినెన్స్..చట్టంగా మారనుంది..

ఆర్డినెన్స్..చట్టంగా మారనుంది..


కాగా భారీ మెజారీతో ఎన్డీఏ ప్రభుత్వం రెండవ సారి గద్దేనెక్కిన నేపథ్యంలో రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే త్రిబుల్ తలాక్ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి పాస్ చేయించుకోవాలనే తలంపుతో ఉంది. లోక్‌సభలో భారి మెజారీటీ ఉన్ననేపథ్యంలో , రాజ్యసభలో కూడ బిల్లును పాస్ చేయించుకోవాలి. లేదంటే ఇప్పటికే త్రిబుల్ తలాక్ పై తెచ్చిన ఆర్డినెన్స్ రద్దయ్యో అవకాశం ఉంటుంది. దీంతో ఎలాగైన బిల్లు పాసయ్యో అవకాశాలే కనిపిస్తున్నాయి.

English summary
the Union Cabinet on Wednesday cleared a fresh bill to ban the practice of instant triple talaq, Environment Minister Prakash Javadekar said.The bill will replace an ordinance issued in February during the previous term
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X