ఆస్పత్రిలో చేరిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆర్థిక శాఖ మంత్రిగా డైనమిక్ గా పేరు తెచ్చుకున్న 63 సంవత్సరాల నిర్మలాసీతారామన్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జాయిన్ అయినట్టు గా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం.
ప్రస్తుతం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఆమె ఆరోగ్యంపై త్వరలో ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం. అసలు ఎందుకు నిర్మలాసీతారామన్ ఆసుపత్రిలో చేరారు? ఆమెకు ఏమైంది? వంటి మరిన్ని వివరాలపై అందరూ ఆలోచిస్తున్న వేళ నిర్మల సీతారామన్ రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వెళ్లినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ కు కేవలం ఒక నెల మాత్రమే ఉన్న సమయంలో నిర్మల సీతారామన్ ఆసుపత్రిలో చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే శనివారం నాడు తమిళనాడు లోని డాక్టర్ ఎం జి ఆర్ మెడికల్ యూనివర్సిటీ 35 వ వార్షిక స్నాతకోత్సవం ఓ నిర్మల సీతారామన్ పాల్గొన్నారు. 2022 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఇటీవలే నిర్మలా సీతారామన్ స్థానం దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications