ఉద్యోగులకు ఆ సౌకర్యాల తొలిగింపు - రేపటి నుంచి కొత్త నిబంధనలు : మార్గదర్శకాలు జారీ..!!
దాదాపు ఏడాదిన్నార కాలంలో కరోనా ప్రభావంతో ఉద్యోగ వ్యవస్థ ఎఫెక్ట్ అయింది. కరోనా నుంచి ఉద్యోగులకు రక్షణ కల్పించటానికి కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు పలు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. అయితే, క్రమేణా కరోనా కేసులు సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయి. ఇక, ఈ నెల 8వ తేదీ నుంచి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సైతం పూర్తి స్థాయిలో పని చేసేందుకు తాజాగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది.

పూర్తి స్థాయిలో ఉద్యోగుల విధులు
రేపటి నుంచి అంటే నవంబర్8 నుంచి కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ భాటియా తెలిపారు. కేంద్రప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కరోనా మహమ్మారి కారణంగా కార్యాలయాలకు తక్కువ సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహించినట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పాటు పనిగంటల్ని తగ్గించినట్లు తెలిపారు. అయితే నవంబర్ 8నుంచి ఈ సౌకర్యాల్ని తొలగిస్తున్నట్లు తెలిపారు.

సౌకర్యాలు ఉప సంహరణ
వాటితో పాటు కొత్త నిబంధనల్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. బయోమెట్రిక్ యంత్రం దగ్గర తప్పనిసరిగా శానిటైజర్ ఉండాలని స్పష్టం చేసారు. అదే విధంగా ఉద్యోగులందరూ హాజరు నమోదుకు ముందు, తర్వాత చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేటప్పుడు ఉద్యోగులు తమ మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని స్పష్టం చేసారు. ద్యోగులందరూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి లేదా ఫేస్ కవరింగ్ ధరించాలని నిర్దేశించారు. బయోమెట్రిక్ మిషన్ టచ్‌ప్యాడ్‌ను తరచుగా శుభ్రం చేయడానికి నియమించబడిన సిబ్బందిని నియమించాలని సూచించారు.
Recommended Video

అప్రమత్తత మాత్రం వీడవద్దంటూ
బయోమెట్రిక్ యంత్రాలను బహిరంగ వాతావరణంలో ఉంచాలని..దీంతో పాటుగా..యంత్రం లోపల ఉంటే, తగినంత సహజ వెంటిలేషన్ ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లోనూ ప్రత్యక్ష విచారణ ప్రారంభం కాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి ఏపీలో ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించారు. కరోనా ప్రభావం తగ్గటంతో అన్ని వ్యవస్థలు తిరిగి యధా విధిగా పని చేస్తున్నాయి. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. ముప్పు తొలిగిపోలేదని..యూరప్ దేశాల్లో థర్డ్ వేవ్ విస్తరిస్తున్న వేళ...రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications