గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత.. రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
భారత రత్న, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణ వార్త యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లతా జీ మరణంతో పాట మూగ బోయినట్లైంది. సంగీత మహల్ ఆగిపోయింది. ఆమె మరణరం పట్ల సినీ ,రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
రెండు రోజుల పాటు సంతాప దినాలు
లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఆమె జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు రేపు జాతీయ సంతాప దినాలుగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో రెండు రోజుల పాటు జాతీయ జెండను రెండు రోజుల పాటు అవనతం చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కరోనాతో పోరాడుతూ కన్నుమూత
గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ.. ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచార. ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు స్వగృహానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ముంబాయిలోని శివాజీ పార్కుకు తరలిస్తారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో సాయంత్రం 6:30 గంటలకు మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది.

.లతా మంగేష్కర్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం
లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, ప్రతి పక్షనేతలు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, తదితరులు ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

కరోనాతో పోరాడుతూ కన్నుమూత
లతా మంగేష్కర్ కి జనవరి 8న కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేర్చారు. దేశ విదేశాల్లో ఉన్న ఆమె అభిమానులు లతా జీ త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేశారు. ఐసీయూలో చిక్సిత పొంతుతున్న ఆమెను వెంటిలేటర్‌కు తరలించారు. దాదాపు నెల రోజుల పాటు కరోనాతో పోరాడుతూ లతా మంగేష్కర్ మృతి చెందారు.












Click it and Unblock the Notifications