కేంద్రమంత్రి మనవరాలి కాల్చివేత, నిందితుడు ఎవరంటే?
కేంద్రమంత్రి, బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) కుటుంబంలో పెను విషాదం నెలకొంది. మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32) తన భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలని గయా జిల్లా టెటువా గ్రామంలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సుష్మా దేవి, రమేష్‌కు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
సుష్మా దేవి తన పిల్లలు, సోదరి పూనమ్ కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలోనే కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పూనమ్ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుష్మా దేవి భర్త రమేష్.. తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి (సుష్మా, రమేష్) మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో నాటు తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డాడు రమేష్. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.

ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్, సుష్మా పిల్లలు పరిగెత్తుకుని రాగా.. అప్పటికే ఆమె రక్తపు ముడగులో ఫడి ఉంది. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాల్పుల్లో సుష్మా దేవి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. తన సోదరిని చంపిన నిందితుడు రమేష్‌ను ఉరితీయాలని పూనమ్ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గయా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం, టెక్నికల్ నిపుణులను ఆధారాల సేకరణకు ఘటన స్థలానికి పంపినట్లు చెప్పారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కాగా, రమేష్‌కు సుష్మపై అనుమానం ఉందని, ఆమెపై కోపం ఉందని, అది ఈ విషాద సంఘటనకు దారితీసిందని తెలిసింది. అయితే, ఈ సంఘటన వెనుక గల కారణాన్ని పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. వారిది కులాంతర వివాహం కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications