సీఎం ఉద్ధవ్ ధాక్రేకు చెంపదెబ్బ వివాదం-కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్టుకు రంగం సిద్ధం
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాజాగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం చెప్పడంలో తడబడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను చెంపదెబ్బ కొడతానంటూ కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది.
స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఉద్ధవ్ థాక్రే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం చెప్పేందుకు తడబడిన నేపథ్యంలో తాను అక్కడే ఉంటే లాగి చెంపదెబ్బ కొట్టేవాడినంటూ కేంద్రమంత్రి నారాయణ్ రాణే నిన్న నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు కావడం, బీజేపీ, శివసేన మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీంతో నారాయణ్ రాణే వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసులు నమోదు చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదంలో ఇవాళ కేంద్రమంత్రి నారాయణ్ రాణేను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన కొంకణ్ రీజియన్ పరిధిలోకి వచ్చే చిప్లున్ లో ఉన్నారని తెలియడంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు నాసిక్ పోలీసులు బయలుదేరి వెళ్లారు. దీంతో కేంద్రమంత్రిని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తుండటం సంచలనం రేపే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. బీజేపీ నేతలు మాత్రం శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు చర్యలపై మండిపడుతున్నారు.
Recommended Video
ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ తాజా విస్తరణలో చోటు సంపాదించిన నారాయణ రాణేకు దూకుడుగా వ్యాఖ్యలు చేసే నేతగా పేరుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివసేన యూత్ వింగ యువసేన నేతల ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీనిపై చర్యల్లో భాగంగా పోలీసులు ఇవాళ రాణే అరెస్టుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య సాగుతున్న వార్ మరింత ముదిరే అవకాశముంది. బీజేపీకి దగ్గరయ్యేందుకు మధ్యలో ప్రయత్నాలు చేసిన శివసేన.. కాషాయ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వార్ కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications