Manipur: కేంద్ర మంత్రి ఇంటికి నిప్పు.. మణిపూర్‍లో కొనసాగుతోన్న హింస..

మణిపూర్ లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతోన్నాయి. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్ లో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి గత రాత్రి గుర్తు తెలియన వ్యక్తులు నిప్పుపెట్టారు. ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంట్లో లేరని అధికారులు తెలిపారు.

కొమ్‌గ్‌బా ప్రాంతంలోని సింగ్ ఇంఫాల్ నివాసం మంటల్లో పాక్షికంగా దెబ్బతిన్నదని, అతని నివాస సముదాయంలోని కొన్ని తాత్కాలిక నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు మణిపూర్‌కు వెళ్లగా, ఆయన ఇంటిపై గుంపు దాడి చేసింది. అధికారిక పని నిమిత్తం తాను కేరళలో ఉన్నానని సింగ్ టెలివిజన్ ఛానెళ్లకు తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దీంతో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్‌ హింసపై ప్రధాని మోదీ ఇప్పటివరకూ స్పందించలేదని విమర్శిస్తున్నాయి. బీజేపీ స్వార్థ రాజకీయమే జాతుల మధ్య రిజర్వేషన్‌ చిచ్చు రాజేసిందని ఆరోపిస్తున్నాయి. అమాయక పౌరులు చనిపోతున్నా ప్రధాని మోడీ మౌనం వీడకపోవటం దారుణమని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పటంలో అమిత్‌ షా, రాష్ట్ర సర్కార్‌ పూర్తిగా విఫలమైందని, మణిపూర్‌ హింసకు మోడీ సర్కార్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

మంగళవారం రాత్రి కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన దాడిలో కనీసం తొమ్మిది మంది మెయిటీ వ్యక్తులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. చురాచంద్‌పూర్ జిల్లాలోని లాంకా వద్ద కుకీ-జోమీల ప్రాబల్యం ఉన్న కంగ్వై అనే గ్రామంపై గురువారం సాయంత్రం దాడి జరిగిందని కుకీ సంస్థల ఫోరమ్ ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటిఎల్‌ఎఫ్) తెలిపింది. "మా గ్రామ వాలంటీర్లను కాల్చి చంపారు.

మే 3 నుండి కుకీ మరియు మెయిటీ కమ్యూనిటీలకు చెందిన 100 మందికి పైగా మరణించారు. 50,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బుధవారం ఇంపాల్ వెస్ట్ లోని పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిపిజెన్ నివాసంపై కూడా నిరసనకారులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో మంత్రి ఇంట్లో లేరు.

Union Minister Rajkumar Ranjan Singhs house in Imphal, Manipur was set on fire by unidentified persons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+