అలాంటివి వద్దు: జయలలితపై వెంకయ్య, సంతోషమని దేవేగౌడ లేఖ

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. గత పదిహేను రోజులుగా జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత స్టాలిన్, అంతకుముందు వైకో తదితరులు చూశారు. ఇప్పుడు వెంకయ్య వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

Venkaiah Naidu

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. జయలలిత ఆరోగ్యంపై వందతులు సరికాదని సూచించారు. ఆమెకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఆమె క్రమంగా కోలుకంటున్నారన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై వస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ వెంకయ్య పరామర్శించారు.

వెంకయ్య నాయుడు అరగంట పాటు ఆసుపత్రిలో ఉన్నారు. వైద్యులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, అమ్మ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉంటున్నారు. అమ్మ కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.

జయలలిత ఆరోగ్యంపై మాజీ ప్రధాని దేవేగౌడ లేఖ

జయలలిత ఆరోగ్యోం పైన మాజీ ప్రధాని దేవేగౌడ తమిళనాడు సీఎస్‌కు లేఖ రాశారు. జయలలిత ఆరోగ్యం కుదుట పడటం సంతోషకరమైన విషయమన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+