ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీనా ? కేంద్రానికి హైకోర్టు చీవాట్లు..!
జాతీయ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో సైతం గాలి నాణ్యత తగ్గుతోంది. దీంతో ప్రజలు శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ గాలి నాణ్యత పెంచే ఎయిర్ ప్యూరిఫయర్లపై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీవ్రంగా తప్పుబట్టింది. అంతే కాదు ప్రజల ప్రాణాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంపై చీవాట్లు పెట్టింది.
మనం ప్రతీ రోజూ 21 వేల సార్లు గాలి పీలుస్తామని, ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యవసర స్దితికి చేరుకుందని ఢిల్లీ హైకోర్టు గుర్తుచేసింది. ఇలాంటి పరిస్ధితుల్లో అత్యవసర వస్తువు అయిన ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ విధించడం సరికాదని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు అక్షింతలు వేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరాలుగా తిరిగి వర్గీకరించాలని, దీనివల్ల అవి కనీస జీఎస్టీ 5 శాతం స్లాబ్ కిందకు వస్తాయని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది.

పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్ధనపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. సకాలంలో దీనిపై స్పందిస్తామంటూ చేసిన అభ్యర్ధనపై స్పందిస్తూ.. సకాలంలో అంటే ఏమిటి? వేలాది మంది చనిపోతే? ఈ నగరంలోని ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం, మీరు దాన్ని అందించలేకపోయారని తెలిపింది. మీరు చేయగలిగేది కనీసం వారికి ఎయిర్ ప్యూరిఫైయర్లను అందుబాటులో ఉంచడమేనని గుర్తుచేసింది. అలాగే ప్రజలకు తక్షణ ఉపశమనం ఇచ్చే అవకాశం పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఈ ఎయిర్ ఎమర్జెన్సీ కాలంలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యగా మీరు ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీని ఎందుకు మినహాయించలేరని కోర్టు ప్రశ్నించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications