సోదరిని వేధిస్తున్న పోకిరిలను అడ్డుకోబోయిన సోదరుడిపై కాల్పులు

Posted By:
Subscribe to Oneindia Telugu


ముజఫర్ నగర్ :సోదరిని వేధిస్తోన్న పోకిరిలను అడ్డుకొన్న సోదరుడిపై పోకిరిలు కాల్పులకు దిగిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.తీవ్రంగా గాయపడిన సోదరుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన నజీమ్ అనే యువకుడు తన సోదరితో కలిసి వెళ్తుండగా పోకిరిలు నజీమ్ సోదరిని వేధించారు. అయితే నజీమ్ పోకిరిలకు అడ్డుపడ్డాడు. తమకు అడ్డుపడడంతో పోకిరిలు మరిం రెచ్చిపోయారు.

eve teasing

తమకు అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేని పోకిరిలు నజీమ్ పై దాడికి దిగారు. పోకిరి బ్యాచ్ లో ఓ యువకుడు తన వద్ద ఉన్న తుపాకీని తీసి నజీమ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో నజీమ్ తీవ్రంగా గాయపడ్డాడు.

నజీమ్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణపాయస్థితిలో నజీమ్ ఉన్నాడని వైద్యులు చెప్పారు. మరో వైపు పోకిరీల కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
nazeem and his sister along with went to shopping in mujafar nagar, four unknown persons eve teasing nazeems sister, nazeem stopped unkonows persons, then unknown persons open firing with gun, nazeem injured
Please Wait while comments are loading...