పెళ్లి కాకపోయినా నో ప్రాబ్లమ్, గదులు బుక్ చేసుకోమంటోన్న 'ఓయో'
బెంగుళూరు : పెళ్లి కాని కపుల్స్.. ఒకే హోటల్ గదిలో ఉండవచ్చా.. ఉండరాదా! ప్రస్తుత తరం యువతలో చాలామందికి కలిగే ప్రశ్న ఇది. ఆమధ్య.. మహారాష్ట్ర నుంచి కేరళకు వెళ్లిన కొంతమంది యువ టూరిస్టులకు అక్కడి హోటల్ యజమానులు రూమ్స్ ఇచ్చేది లేదంటూ షాక్ ఇవ్వడంతో.. అప్పట్లో ఆ అంశం కొంత చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇకమీదట అలాంటి తిప్పలు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఓయో లాంటి ప్రముఖ హోటల్ సంస్థలు తమ హోటళ్లలో పెళ్లికాని జంటలకు కూడా గదులు బుక్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అవివాహిత యువతీ యువకులు.. కాస్త ప్రైవసీ కోరుకునే జంటల కోసం.. రెండు నెలల క్రితం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని చేపట్టింది ఓయో.

కొత్త నిర్ణయం మంచి ఫలితాలనివ్వడంతో.. దేశంలోని వంద మెట్రో నగరాల్లో కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ ను ప్రారంభించింది ఓయో. ఓయో హోటళ్లు విస్తరించి ఉన్న మొత్తం 200 నగరాల్లో 70వేల గదులుండగా.. ఇందులో ఎక్కువ భాగం.. 60 శాతం గదులను అవివాహితులకే కేటాయించడానికి ఓయో నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఓయో కస్టమర్లలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న అవివాహితులే కావడంతో.. ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది ఓయో. కాగా, ఓయో తాజా నిర్ణయంతో అన్ మ్యారీడ్ కపుల్స్ అంతా అటువైపే 'క్యూ' కడుతున్నారట.












Click it and Unblock the Notifications