యూపీలో ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్ని రైలు, 13 మంది విద్యార్థులు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో 13 మంది చిన్నారులు అక్కడికి అక్కడే మృతి చెందారు. రైలు పట్టాలు దాడుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొంది. రైలు వేగానికి బస్సు ముక్కలు ముక్కలు అయింది.
క్రాసింగ్ వద్ద కాపలాదారు లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో విద్యార్థులు సహా 25 మంది విద్యార్థులు ఉన్నారు.

తవే-కపతన్‌గంజ్ ప్యాసింజర్ రైలు.. పట్టాల పైకి వచ్చిన బస్సును ఢీకొట్టడంతో విద్యార్థులు అక్కడికి అక్కడే మృతి చెందారని రైల్వే అధికార ప్రతినిధి చెప్పారు. ఈ సంఘటన గోరక్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణ కోసం ఆదేశించారు.












Click it and Unblock the Notifications