రికార్డు: ఉత్తర్ ప్రదేశ్ లో 38 మంది మహిళ ఎమ్మెల్యేల విజయం, బిజెపి సభ్యులే ఎక్కువ
ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 38 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం ఇదే ప్రథమం.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించడం కూడ రికార్డేనని చరిత్ర చెబుతోంది.ఈ ఎన్నికల్లో 38 మహిళలు విజయం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
ఏడు దశల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వివిద రాజకీయ పార్టీలు 96 టిక్కెట్లను మహిళలకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో బిజెపి 43 స్థానాలను మహిళలకు కేటాయించింది.
అయితే 43 మంది మహిళా అభ్యర్థుల్లో 32 మంది విజయం సాధించారు. బిఎస్ పి , కాంగ్రెస్ పార్టీల నుండి ఇద్దరేసి చొప్పున ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

సమాజ్ వాదీ పార్టీ, అప్నాదళ్ పార్టీల నుండి ఒక్కొక్క అభ్యర్థి ఈ దఫా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్నికల కమీషన్ లో ఉన్న రికార్డుల ప్రకారంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 20 మంది మహిళలు విజయం సాధించారు.
1991 అసెంబ్లీ ఎన్నికల్లో 31 మందికి గాను 10 మంది మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1989 లో 18 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.2007 లో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే మహిళలు విజయం సాధించారు.2012 ఎన్నికల్లో మహిళ ఎమ్మెల్యేలు 35 మంది మాత్రమే విజయం సాధించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో 38 మంది మహిళలు విజయం సాధించారు.
అయితే ఈ ఎన్నికల్లో బిఎస్ పి 20 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించింది.2012 లో బిఎస్ పి 33 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.ఈ దఫా సమాజ్ వాదీ పార్టీ 33 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.కాంగ్రెస్ పార్టీ 11 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.
2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 34 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయిస్తే 22 మంది విజయం సాధించారు. 2017 ఎన్నికల్లో ఆ పార్టీ 42 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయిస్తే కేవలం ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
బిజెపి ఈ దఫా 43 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.అయితే ఇందులో 32 మంది విజయం సాధించారు. అయితే రికార్డు స్థాయిలో ఈ అసెంబ్లీకి మహిళలు ఎన్నిక కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళ ఎమ్మెల్యేలను ఆయన అభినందిస్తూ ట్వీట్ చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications