పోలీస్ రాజ్..? హోటల్‌లో వ్యాపారిపై పోలీసుల దాడి, మృతి.. ఆరుగురు ఖాకీల సస్పెండ్..
ఉత్తరప్రదేశ్ అంటేనే రౌడీ రాజ్.. గుండా, మాఫియాలతో అట్టుడుకుతుండేది. యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఆగడాలకు పుల్ స్టాప్ పడినట్టే అనిపించింది. కానీ పోలీస్ రాజ్ ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన ఘటన కలకలం రేపింది. హోటల్‌లో ఉన్న బిజినెస్ మెన్‌పై పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ప్రవేశించి.. ఐడీ చూపాలని తమ ప్రతాపం చూపించారు. దీంతో ఆ వ్యాపారి కన్నుమూయగా దుమారం చెలరేగింది. ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను తప్పుపట్టగా.. యోగీ సర్కార్ స్పందించింది. యోగి ఇలాఖాలో ఈ ఘటన జరగడం అతని ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది.

వ్యాపారుల భేటీ..
గోరఖ్‌పూర్ ఓ హోటల్‌లో ముగ్గురు వ్యాపారులు సమావేశం అయ్యారు. రెగ్యులర్ చెకప్ కోసం పోలీసులు వచ్చారు. అయితే అందులో ఒకరు మనీశ్ కుమార్ గుప్తా ఉన్నారు. అర్ధరాత్రి దాటాక వచ్చి ఐడీ కార్డు చూపాలని వేధింపులకు గురిచేశారు. మిగతా వ్యాపారులతో గొడవకు దిగారు. మనీశ్ ఇదేంటి అని ప్రశ్నించగా.. ఇద్దరిని బయటకు పంపించారు. అతనిపై దాడి చేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం, తలపై రక్తం వచ్చిందని అతని స్నేహితుడు తెలిపారు.

ఏం జరిగిందంటే..
ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అనే అంశంపై స్నేహితుడు సింగ్ వివరించారు. ఇతను హర్యానాలో గల గురుగ్రామ్‌కు చెందినవారు. మద్యం సేవించిన పోలీసులు తమ గదికి వచ్చారని ఆరోపించారు. వారి చేతిలో తుపాకులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తమను ఐడీ కార్డులు చూపించమని బెదిరించారని.. దాడి చేశారని తెలియజేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనే సమాచారం వచ్చిందని వివరించారు. అందుకే రైడ్ నిర్వహించామని కవరింగ్ చేసే యత్నం చేశారు.

ముగ్గురు కలిసి ఉండటంతో..
వివిధ నగరాలకు చెందిన వ్యాపారులు హోటల్ గదిలో ఉన్నారని గోరఖ్ పూర్ పోలీస్ చీఫ్ విపిన్ తాడా వివరించారు. మేనేజర్ సాయంతో గదిలోకి ప్రవేశించామని పేర్కొన్నారు. గదిలో అనుకొకుండా జరిగిన ఘటనలో వ్యాపారి గాయపడ్డారని వివరించారు. వెంటనే అతనిని ఆస్పత్రికి కూడా తరలించారని చెప్పారు. అర్ధరాత్రి హోటళ్లను తనిఖీ చేయడం తమ రోజువారీ డ్యూటీలో భాగం అని వివరించారు. ఈ కామెంట్లను మృతుడి భార్య ఖండించారు. చనిపోయే 10 నిమిషాల ముందు కూడా తనతో మాట్లాడరని చెప్పారు. పోలీసులు వచ్చారని చెప్పారని.. తర్వాత అతను ఫోన్ చేస్తాడని భావించానని పేర్కొన్నారు. పోలీసులు వేధించి.. దాడి చేసి హతమార్చారని ఆరోపించారు. వ్యాపారి మృతి కలకలం రేపింది.
Recommended Video

పోలీస్ రాజ్..
ఘటనను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండిచారు. రాష్ట్రంలో ఎన్ కౌంటర్ కల్చర్ కొనసాగుతోందని ఆరోపించారు. అమాయకులపై దాడి చేసి.. హతమార్చడం ఏంటీ అని తప్పుపట్టారు. సీఎం ఇలాఖాలో ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని కామెంట్ చేశారు. విమర్శలు రావడంతో యోగి సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఘటనకు బాధ్యులయిన ఆరుగురు పోలీసులను విధుల నుంచి తప్పించింది. అంతేకాదు వారిపై హత్య కేసు కూడా నమోదు చేశామని వివరించారు. మృతుడి భార్యకు యోగి సర్కార్ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications