పెరోల్ ఇస్తామన్నా... జైల్లోనే ఉంటామంటూ ఖైదీల వేడుకోలు: ఎక్కడంటే..?
లక్నో: కరోనా మహమ్మారి కారణంగా అనేక అంశాల్లో మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖైదీలు వింతగా ప్రవర్తిస్తున్నారు. బెయిల్ ఇస్తాం.. ఇంటికి వెళ్లండి అని అధికారులు అంటే.. ఖైదీలు మాత్రం దయచేసి మమ్మల్ని ఇంటికి పంపొద్దు.. జైల్లోనే ఉండనివ్వండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు.
రాష్ట్రంలోని తొమ్మి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు కరోనా వ్యాప్తిస్తున్న కారణంగా జైలు కంటే తమకు సురక్షిత ప్రాంతం లేదని, పెరోల్(తాత్కాలిక విడుదల) తమకు వద్దని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. గజియాబాద్, గౌతంబుద్ధ్ నగర్, మీరట్, మహారాజ్ గంజ్, గోరఖ్ పూర్, లక్నో జైళ్లలోని ఖైదీలు ఈ మేరకు మొరపెట్టుకున్నట్లు జైళ్ల పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ తెలిపారు.

ఈ పరిస్థితుల్లో బయటికి వెళితే తిండి, ఆరోగ్యానికి భరోసా ఉండదు. ఇక్కడైతే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం. గంట కొట్టగానే అన్నం పెడతాం. పైగా వాళ్లకిచ్చే 90 రోజుల పెరోల్ కాలాన్ని మళ్లీ శిక్షకాలంలో కలుపుతామని జైళ్ల శాఖ డీజీ తెలిపారు. అందుకే ఖైదీలు బయటికి వెళ్లేందుకు సుముఖత చూపడం లేదని అన్నారు. ఖైదీలు లిఖితపూర్వకంగా కోరారు కాబట్టి ఆమోదించకతప్పదని చెప్పారు.
కాగా, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో జైళ్లలో సమాజిక దూరం సమస్యగా మారుతోందని సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఏడేళ్లలోపు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, కేసులు విచారణలో ఉన్నవారికి పెరోల్ లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయం పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే యూపీలో ఇప్పటి వరకు 2200 మందిని పెరోల్ పైన, 9200 మందిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసినట్లు ఆనంద్ కుమార్ వెల్లడించారు.
Recommended Video
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications