షాక్: మోడీ కోసం పెళ్లి రద్దు చేసుకున్న వధూవరులు!

Subscribe to Oneindia Telugu

కాన్పూర్: ఏవేవో కారణాలతో వివాహాలు రద్దు కావడం చూసే ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఓ అభిమాన నేత కోసం పెళ్లి రద్దు చేసుకున్నాడు వరుడు. వధువుతో గొడవ పడి 'నీవు నాకు తగిన దానివి కాదు'అంటూ పెళ్లి ఏర్పాట్లను రద్దు చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, ఓ మహిళ ప్రభుత్వోద్యోగికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లపై చర్చించుకునేందుకు ఇరుకుటుంబాల వారు ఓ గుడిలో సమావేశమయ్యారు. పెళ్లి పనులపై మాట్లాడుకున్నారు.

అయితే, మాటల మధ్యలో దేశ ఆర్థిక వ్యవస్థపైకి వీరి చర్చ వెళ్లింది. ఆర్థికంగా దేశం వెనకబడిపోతోందని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీయే కారకుడని యువతి తన అభిప్రాయాన్ని చెప్పింది. మోడీ అభిమాని అయిన పెళ్లి కొడుకు.. దీన్ని ఖండించాడు.

 A UP Couple Called Off Their Wedding Because of a Fight Over PM Modi

ఇదే విషయంపై వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో భిన్నాభిప్రాయాలతో కలిసి ఉండటం కష్టమని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వారి కుటుంబసభ్యులకు కూడా చెప్పేశారు.

కాగా, నెటిజన్లు ఈ ఉదంతంపై స్పందిస్తూ.. చాలా మంది వరుడికి మద్దతు పలుకగా, కొంతమంది వధువుకు అండగా నిలిచారు. మోడీ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బయట తిరిగేందుకు అవకాశం లేదని, అందుకే వారు మోడీపై ఆగ్రహంగా ఉన్నారని పలువురు పేర్కొన్నారు. అభిప్రాయ భేదాలతో పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని కొందరు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Of all the things in the world, this has got to be the best worst reason to call off a wedding. According to a ToI story, a couple from Kanpur, all set to get married, faced a speedbump that would prove to be completely fatal to their impeding marriage.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి