రాహుల్ గాంధీకి రూ. 200 జరిమానా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ న్యాయస్థానం రూ. 200 జరిమానా విధించింది. పదే పదే విచారణకు గైర్హాజరు అవుతున్న నేపథ్యంలో ఈ మేరకు జరిమానా వేసింది. ఏప్రిల్ 14న తదుపరి విచారణకు హాజరుకాకుంటే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీని తీవ్రంగా హెచ్చరించింది.
మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటీష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్‌ను కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొంటూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు సంబంధించి తాజాగా మరోసారి విచారణ జరిగింది. రాహుల్ గాంధీ తరపున న్యాయవాది ప్రన్షు అగర్వాల్ హాజరయ్యారు. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారని, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఈ క్రమంలోనే పదే పదే విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి అప్పర్ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రూ. 200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న జరిగే తదుపరి విచారణకు రాహుల్ తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని ఉంటుందని రాహుల్ గాంధీని కోర్టు హెచ్చరించింది.












Click it and Unblock the Notifications